#RIPJosephVijay హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్న విజయ్ యాంటీ ఫ్యాన్స్..కారణం?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (ఇళయదళపతి విజయ్) నటించిన ‘బీస్ట్’ మూవీ విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 13న విడుదల కాబోతుంది.’డాక్టర్’ ఫేమ్ నెల్సన్ ఈ చిత్రానికి దర్శకుడు. కచ్చితంగా ఈ మూవీ హిట్ అవుతుంది అని విజయ్ అభిమానులు ఆశపడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఎవ్వరూ ఊహించని విధంగా విజయ్ చనిపోయాడు అంటూ #RIPJosephVijay అనే హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతుండడం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యింది.

Click Here To Watch NOW

దీంతో విజయ్ అభిమానులు మాత్రమే కాదు… యావత్ సినీ ప్రేమికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనికి గల కారణం ఏంటా? అని విశ్లేషిస్తే.. అజిత్ ఫ్యాన్స్ ఈ దారుణానికి పాల్పడినట్టు తేలింది. విజయ్ ఫ్యాన్స్ కు అజిత్ ఫ్యాన్స్ కు అస్సలు పడదు అన్న సంగతి తెలిసిందే.ఇద్దరికీ అక్కడ సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అయితే అజిత్ కొంతవరకు తన అభిమానులను కంట్రోల్ చేయడానికి.. నాకు ఎటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్లు వద్దు అంటూ చెబుతుంటాడు.

కానీ విజయ్ అభిమానులు ఏదో ఒక విధంగా అజిత్ అభిమానుల్ని గిల్లుతుంటారు.2019లో అజిత్ నటించిన ‘నేర్కొండ పర్వాయి’ రిలీజ్ టైములో విజయ్ అభిమానులు నెగిటివ్ ట్రెండ్ ప్రారంభించారు. ‘వాలిమై’ టైములో కూడా ఇలాంటి నెగిటివ్ ట్రెండ్ కొనసాగింది.’మాస్టర్’ సినిమా టైములో అజిత్ ఫ్యాన్స్ కొంతవరకు పగ తీర్చుకున్నారు. కానీ ఇప్పుడు ‘వాలిమై’ ‘బీస్ట్’ సినిమాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఈ నెగిటివ్ ట్రెండ్ ను అజిత్ ఫ్యాన్స్ కొనసాగిస్తున్నారు.

ఈ నెగిటివ్ ట్రెండ్ కు ‘కె.జి.ఎఫ్’ మూవీ ఫ్యాన్స్ కూడా మద్దతుపలుకుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ‘కె.జి.ఎఫ్2’ టైంలోనే విజయ్ ‘బీస్ట్’ రిలీజ్ కాబోతుంది. ఇటీవల ధోని ఐపియల్ నుండీ తప్పుకుంటున్నట్టు వెల్లడించడం.. అజయ్ జడేజాకి కెప్టెన్సి దక్కడంతో విజయ్ సూసైడ్ అటెంప్ట్ చేసాడని.. అదే టైములో ప్రాణాలు కోల్పోయాడని విజయ్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

1

2

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus