దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్న బాహుబలి చిత్రంలో ప్రతి పాత్రకు ఒక గుర్తింపు ఉంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పోషించిన బాహుబలి పాత్ర తర్వాత అందరిలో ముద్రపడిన క్యారక్టర్ శివగామి. దైర్యం, సాహసం, తెలివి తేటలు కలిగిన ఈమె మహిస్మతి రాజ్యాన్ని పిల్లలు ఎదిగేవరకు రక్షించింది. సినిమాలో నిడివి కారణంగా శివగామి పాత్ర గురించి ఎక్కువ చూపలేకపోయారు జక్కన్న. ఆలోటును రచయిత ఆనంద్ నీలకంఠన్ పూడుస్తున్నారు. శివగామి గురించి పూర్తి కథను మనకు ‘ది రైజ్ ఆఫ్ శివగామి’ పేరుతో పుస్తకాన్ని రాశారు. ఈ చిత్రాన్ని జైపూర్ లో జరుగుతున్న సాహిత్య ఉత్సవంలో నేడు రాజమౌళి, దగ్గుబాటి రానా రిలీజ్ చేశారు.
ఇంగ్లిష్ భాషలోని ఈ బుక్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. త్వరలో హిందీ, తమిళం, కన్నడం, మలయాళం, తెలుగు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. రచయిత నీలకంఠన్ ఈ ఒక్క పుస్తకంతో ఆగడంలేదు. బాహుబలి బిగినింగ్ చిత్రానికి ముందు ఏమి జరిగిందో మొత్తాన్ని పుస్తకాల రూపంలో వివరించనున్నారు. ముఖ్యంగా కట్టప్ప గురించి రెండు పుస్తకాల రూపంలో తీసుకురానున్నారు. బాహుబలి కంక్లూజన్ చిత్రం రిలీజ్ అయిన తర్వాత మిగిలిన పుస్తకాల విడుదల ఉంటుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.