Rishab Shetty: కాంతార అప్డేట్‌ వచ్చేసింది.. అలా హీరో ఫ్యాన్స్‌కి కిక్‌ ఇచ్చే విషయం కూడా!

కష్టాలు చూసిన చోట.. విజయాల గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది.. ఇప్పటికప్పుడు కళ్లకు ఎదురుగా అలాంటి ఫీట్‌ కనిపించాలి అంటే రిషబ్‌ శెట్టిని చూపించాలి. ‘కాంతార’ సినిమాతో పాన్‌ ఇండియా లెవల్‌లో హిట్‌ కొట్టిన రిషబ్‌ శెట్టి కెరీర్‌ అంత కేక్‌ వాక్‌ ఏమీ లేదు. సింపుల్‌గా చెప్పాలంటే కట్టెలు అమ్మిన చోట ఇప్పుడు ఆయన పూలు అమ్ముతున్నాడు. ఏంటి ఈ సామెతను తిప్పి చెప్పారు అనుకుంటున్నారా? ఆయన తిప్పి చెప్పేలా విజయం సాధించాడు కాబట్టి.

‘కాంతార’ సినిమాతో శాండిల్‌ వుడ్‌లో ఓ సినిమాను నటించి, దర్శకత్వం వహించిన రిషబ్‌ శెట్టి.. తన కెరీర్‌లో మోస్ట్‌ ఎమెషనల్‌ అండ్‌ ప్రెసియస్‌ మూమెంట్‌ను ఇటీవల ఫీల్‌ అయ్యాడు. ఆ సినిమా అతనికి పాన్‌ ఇండియా గుర్తింపును ఇవ్వగా.. ఇప్పుడు తను ఎన్నో కష్టాలు పడిన చోట పురస్కరం అందుకున్నాడు. భూతకోల నేపథ్యంలో తెరకెక్కిన ‘కాంతార’ సినిమాకు ఉత్తమ నటుడిగా క్రిటిక్స్‌ ఛాయిస్‌ పురస్కారాన్ని అందుకున్నాడు.

ముంబయి వేదికగా ఇటీవల జరిగిన అవార్డుల కార్యక్రమంలో రిషబ్‌ (Rishab Shetty) మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. ‘‘ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. 15 ఏళ్ల క్రితం నేను మొదటిసారి ముంబయి వచ్చాను. అంధేరీ వెస్ట్‌లో ఉన్న ఓ నిర్మాణ సంస్థలో ఆఫీస్‌ బాయ్‌గా పనిచేశాను. 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇదే ముంబయిలో ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నాను. ఈ క్షణం చాలా సంతోషంగా ఉంది’’ అని చెప్పాడు.

భూతకోల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘కాంతార’కు సంబంధించి కొత్త న్యూస్‌ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి ప్రీక్వెల్‌ రానున్న సినిమా గురించి ఆసక్తికర విషయం చెప్పారు. సీసీఏ అవార్డు తీసుకున్న అనంతరం రిషభ్‌ శెట్టి.. ఈ ప్రాజెక్ట్‌ గురించి మాట్లాడుతూ ‘‘మీరు ఇప్పటికే ‘కాంతార 2’ చూశారు. త్వరలో ‘కాంతార 1’ చూస్తారు’’ అని చెప్పారు. దీంతో ఫ్యాన్స్‌కి ఇది కిక్‌ ఇచ్చే న్యూస్‌ అని చెబుతున్నారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus