Rishab Shetty: నేను ఎవరిని ఉద్దేశించి అలా మాట్లాడలేదు!

కన్నడ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో రిషబ్ శెట్టి ఒకరు. ఈయన హీరోగా కన్నడ చిత్ర పరిశ్రమలో నటిస్తూ మరోవైపు దర్శకుడిగా కూడా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈయన దర్శకత్వంలో తానే నటించినటువంటి కాంతార సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఇలా కాంతార సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఇకపోతే కాంతార సినిమాకు దేశవ్యాప్తంగా ఎంతో మంచి ఆదరణ రావడంతో గోవాలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫి) వేడుకలో కాంతార చిత్రానికి సిల్వర్‌ పీకాక్‌ అవార్డు వచ్చింది అయితే ఈ వేడుకలలో రిషబ్ శెట్టి చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తన సినిమాని మొదట ఆదరించినది కన్నడ ప్రేక్షకులేనని వారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని తెలిపారు. అంతేకాకుండా ఒక హిట్టు పడగానే తాను ఇతర పరిశ్రమలకు వెళ్లే రకం కాదు అంటూ మాట్లాడారు.

ఈయన తప్పకుండా రష్మిక మందన్నను ఉద్దేశించే మాట్లాడారు అంటూ ఈ వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి అయితే ఈ వార్తలపై ఒక నెటిజన్ స్పందిస్తూ..రిషబ్‌శెట్టి ఎవరినీ ఉద్దేశించి ఆ మాటలు అనలేదని, కన్నడ పరిశ్రమను వదిలివెళ్లనని మాత్రమే చెప్పారని కామెంట్‌ చేశారు. ఇలా నేటిజన్ చేసినటువంటి కామెంట్ పై రిషబ్ శెట్టి స్పందిస్తూ.. చాలామంది నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు నువ్వు ఒక్కడివే నిజాన్ని తెలుసుకున్నావు అంటూ ఈయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రిషబ్ (Rishab Shetty) దర్శకత్వంలో రష్మిక నటించిన మొట్టమొదటి చిత్రం కిరిక్ పార్టీ ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు చిత్ర పరిశ్రమను వదిలి టాలీవుడ్ అలాగే బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న నేపథ్యంలోనే ఈమెను ఉద్దేశించి రిషబ్ మాట్లాడారని అందరూ భావించారు కానీ తాను అలాంటి ఉద్దేశంతో అనలేదని ఈయన తెలియజేశారు.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus