Rishab Shetty: కాంతార2 విడుదల అయ్యేది అప్పుడే… రిషబ్ శెట్టి కామెంట్స్ వైరల్!

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి సినిమాలలో కాంతార ఒకటి. ప్రముఖ కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భూతకోల నృత్యం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మొదట కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనమైన విజయమందుకోవడంతో ఈ చిత్రాన్ని ఇతర భాషలలో కూడా విడుదల చేశారు. కేజిఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోం భలే ఫిలిమ్స్ నిర్మాణంలో తెరకేక్కిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

అత్యంత తక్కువ బడ్జెట్ తో ఈ సినిమా కొన్ని వందల కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని కూడా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ పనులలో చిత్ర బృందం బిజీ అయ్యారు. అయితే తాజాగా డైరెక్టర్ కమ్ హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) ఈ సినిమా గురించి కీలక అప్డేట్ విడుదల చేశారు. ఈ సినిమా షూటింగ్ ఏ దశలో ఉందనే విషయాల గురించి ఈయన తెలియజేశారు.

అయితే ప్రస్తుతం కాంతార సీక్వెల్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారని తెలియజేశారు. అలాగే సినిమా షూటింగ్ లోకేషన్ కూడా సెర్చ్ చేస్తున్నామని తెలిపారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది పూర్తి చేసుకుని 2024వ సంవత్సరంలోనే విడుదల కాబోతుందని ఈయన తెలియజేశారు.

ఇక కాంతర సినిమాని ఈ స్థాయిలో సక్సెస్ చేసినటువంటి అభిమానుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని ఇంతటి ఘన విజయానికి కారణమైనటువంటి ప్రేక్షకులందరికీ ఈ సందర్భంగా ఈయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకోనుందని తెలుస్తోంది.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus