Rishab Shetty : రుక్మిణి ని అన్ ఫాలో చేసిన రిషబ్… అసలు ఏం జరుగుతోంది ?
- March 28, 2026 / 01:49 PM ISTByFilmy Focus Desk
కన్నడ స్టార్ డైరెక్టర్-హీరో రిషబ్ శెట్టి పేరు మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కారణం ఏంటంటే.. ఆయన చేసిన ఒక చిన్న సోషల్ మీడియా యాక్షన్ పెద్ద చర్చకు దారి తీసింది. ‘కాంతార’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ ఫిల్మ్‌మేకర్, తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి హీరోయిన్ రుక్మిణి వసంత్ తో పాటు నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలిమ్స్ ఖాతాలను అన్ ఫాలో చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
Rishab Shetty
సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సోషల్ మీడియా మార్పులు కనిపిస్తే, వెంటనే విభేదాల ఊహాగానాలు మొదలవుతాయి. అదే ఇక్కడ కూడా జరిగింది. ‘కాంతార’ టీమ్‌లో అంతా సవ్యంగానే ఉందనుకున్న సమయంలో ఈ అనూహ్య పరిణామం వెలుగులోకి రావడంతో, అసలు ఏం జరుగుతోంది? అనే ప్రశ్నలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. హోంబలే ఫిల్మ్స్ అధినేతను మాత్రం రిషబ్ ఇంకా ఫాలో అవుతుండటం. దీంతో సమస్య వ్యక్తిగతమా? లేక ప్రొఫెషనల్‌గా ఏదైనా జరిగిందా? అన్న సందేహాలు మరింత పెరిగాయి.

ఇక మరో ట్విస్ట్ ఏమిటంటే, తనకు సన్నిహితుడిగా పేరున్న నటుడు రాజ్ బి శెట్టి ను కూడా రిషబ్ అన్ ఫాలో చేయడం. ఇద్దరూ కలిసి పనిచేసిన రోజుల నుంచి మంచి బాండింగ్‌తో ఉన్నారని తెలిసిన అభిమానులు ఈ పరిణామాన్ని చూసి షాక్ అవుతున్నారు. ఒక్కసారిగా ఇలా డిస్టెన్స్ తీసుకోవడం వెనుక ఏదో బలమైన కారణం ఉండొచ్చని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.
ఈ గాసిప్స్ అన్నీ ఇలా ఉంటే, రిషబ్ మాత్రం తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ‘జై హనుమాన్’లో ఆయన కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తానికి, సోషల్ మీడియాలో ఒక అన్ ఫాలో ఎంత పెద్ద చర్చకు దారి తీస్తుందో మరోసారి స్పష్టమైంది. అసలు నిజం ఏంటో మాత్రం అధికారికంగా వెల్లడయ్యే వరకు ఈ సస్పెన్స్ అలాగే కొనసాగనుంది.











