నెటిజన్ల కంటే జనాలు చాలా డేంజర్‌ ఊర్వశీ చూసుకో మరి!

క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ – నటి ఊర్వశీ రౌతేలా మధ్యలో ఏముంది? ఈ మాటకు సమాధానం చెప్పడం చాలా కష్టం. టామ్‌ అండ్‌ జెర్రీ ఫైట్‌ లాంటి చిన్నపాటి ఫైట్‌ అయితే ఉంది. పంత్‌ను, అతని అభిమానులను పోక్‌ చేస్తూ ఊర్వశీ అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు చేస్తుంటుంది. మరోవైపు పంత్ అయితే డైరెక్ట్‌గా ఆమెకు కౌంటర్‌ ఇస్తుంటాడు. చాలా రోజులుగా సాగుతున్న ఈ క్రికెట్‌ – మూవీ వార్‌ ఇటీవల విశాఖపట్నంలో ఊర్వశిని కాస్త ఇరిటేట్‌ చేసింది అనే చెప్పాలి.

ఊర్వశీ రౌతేలా ప్రత్యేక గీతంలో ఆడిపాడిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఇటవల విశాఖపట్నంలో జరిగింది. అందులో పాల్గొన్న ఊర్వశీని ప్రేక్షకులు కాసేపు ఆటపట్టించారు. ఆమె అక్కడ మాట్లాడటం ప్రారంభించగానే.. కొంతమంది జనాలు ‘రిషబ్‌ పంత్’ నామ జపం చేశారు. చాలాసేపు వరకు వాళ్లు అలానే అంటుండేసరికి కాస్త ముఖం చిట్లించుకుంది ఊర్వశి. ఇక వీళ్లు ఆగేలా లేరు అనుకుని తర్వాత తన మినీ ప్రసంగాన్ని పూర్తి చేసింది.

అయితే ఇన్నాళ్లూ రిషబ్‌ పంత్‌ను తన సోషల్‌ మీడియా పోస్టులతో ఆటపట్టించిన, ఇరిటేట్‌ చేసిన ఊర్వశికి నెటిజన్లు రివర్స్‌ కామెంట్లతో ఏడిపించేవారు. అయితే ఇప్పుడు ఆ కామెంట్లు ఏకంగా బయటి జనాలు కూడా అనేసరికి ఇబ్బందిపడింది అనే చెప్పాలి. కానీ ఆమె పోస్టుల వల్ల పంత్, ఆయన అభిమానులు ఎంత బాధపడి ఉంటారో అర్థం కావాలి కదా. ఇటీవల రిషబ్‌ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రిషబ్‌కు ముంబయిలోని ఓ ఆసుపత్రిలో ఉంచి వైద్యం అందిస్తున్నారు.

అయితే ఆ ఆసుపత్రి ఫొటోను షేర్‌ చేసిన ఊర్వశీ.. కామెంట్‌గా ముంబయిలో ఉన్నా అని పెట్టింది. దీంతో కావాలనే ఊర్వశీ అలా చేస్తోంది అంటూ నెటిజన్లు గయ్యిమన్నారు. ఇప్పుడు ఓపెన్‌గా ఈవెంట్‌లోనే కామెంట్‌ చేశారు. మరి ఇప్పటికైనా ఊర్వశీ మారుతుందో లేదో చూడాలి.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus