బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ పొందుతుంది. ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయాన్ని వస్తే… ఏంజెల్ రిషిని ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన వసుధార ఏడుస్తూ ఉంటుంది. వసుధర కాలేజీకి రాకపోవడంతో అసలు ఎందుకు రాలేదు అని రిషి తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అంతలోపు పాండియన్ అక్కడికి రావడంతో వసుధర మేడం వచ్చారా అని అడగగా లేదు సర్ అని చెబుతారు.
ఒకసారి తనకి ఫోన్ చేసి కనుక్కోండి అని చెప్పడంతో పాండియన్ ఫోన్ చేసేలోపు వసుధార ఎదురుగా రావడంతో వసుధార మేడం వస్తున్నారు అని చెప్పడంతో సరే నువ్వు వెళ్ళు అని తనని పంపిస్తారు. పరధ్యానంలో ఉన్నటువంటి వసుధర రిషి ముందే వెళ్తున్నప్పటికీ పట్టించుకోదు దీంతో రిషి ఎందుకు ఆలస్యమైంది అంటూ తనని అడుగుతారు. దాంతో వసుధార ఏమీ లేదు సర్ అంటూ సమాధానం చెబుతుంది. నాకు ఏదో మెసేజ్ పెట్టి డిలీట్ చేశావు అని అడగడంతో పొరపాటున వచ్చింది సార్ అని చెప్పడంతో రిషి అది ఏమైనా ఫోన్ కాలా పొరపాటున రావడానికి నువ్వు మెసేజ్ టైప్ చేసి సెండ్ చేస్తేనే నాకు వస్తుంది.
నాకు ఆ మాత్రం తెలియదనుకుంటున్నావా అంటూ రిషి మాట్లాడటంతో మీకు తెలియాల్సినవి మాత్రం తెలియదు సార్ అంటూవెళ్ళిపోతూ ఉండగా రిషి తనకు అడ్డుపడి ఒకసారి నా వైపు చూసి మాట్లాడండి అనడంతో రిషివైపు వసుధార చూడగా తన కళ్ళల్లో నీళ్లు ఉంటాయి. వసుధారను అలా చూసేసరికి కంగారు పడిన రిషి అసలేం జరిగింది చెప్పండి మేడం ఎందుకు అలా ఉన్నారు ఏదైనా సమస్య ఉందా అంటూ తనని అడగగా తను మాత్రం కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు సార్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
క్లాస్ లోకి వెళ్లిన వసుధార అదే ధ్యాసలో ఉండి స్టూడెంట్స్ మ్యాస్ కరెక్ట్ గా చేసిన అన్ని రాంగ్ వేయడంతో పాండియన్ అనుమానం వచ్చి తాను బయటకు వెళ్లడానికి పర్మిషన్ ఇవ్వమంటే వసుధార పంపిస్తుంది. మరోవైపు శైలేంద్ర రిషిని దెబ్బతీయాలంటూ చేసినటువంటి ప్లాన్స్ అన్ని రివర్స్ అవుతున్నాయని టెన్షన్ పడుతుంటారు. దీంతో అక్కడికి దేవయాని వస్తుంది. ఏమైంది అని అడగడంతో ఎన్ని ప్లాన్స్ చేసిన రివర్స్ అవుతున్నాయి కాలేజ్ ని దెబ్బ తీయాలని పేపర్లో వేయించిన ఆది వర్కౌట్ కాలేదు అని శైలేంద్ర చెప్పడంతో ఆవేశంలో ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి వర్కౌట్ కాలేదని టెన్షన్ పడుతుంటావు ఎలాగైనా ఆ కాలేజ్ నీ హస్తగతమయ్యేలా చేస్తాను అంటూ దేవయాని తన కొడుకుకి నాలుగు చివాట్లు పెట్టి చెబుతుంది.
ఇక డిపిఎస్టి కాలేజ్ స్ట్రెంత్ పెరగడంతో జగతి ఎంతో సంతోషపడుతుంది. ఇదంతా నా కొడుకు తెలివితేటల వల్ల సాధ్యమైంది అంటూ మాట్లాడుతుంది. మహేంద్ర మీకు మాత్రమే కొడుకు కాదు నాకు కూడా కొడుకే అంటూ మీసం మేలేస్తాడు. ఇప్పుడు మన రిషి ఏం చేస్తుంటాడు అంటావ్ అని చెప్పడంతో మహేంద్ర ఏం చేస్తుంటాడు చదువుతూ ఉంటాడు అని చెబుతాడు కట్ చేస్తే రిషి అలాగే చదువుతూ ఉంటాడు. అక్కడికి పాండియన్ వచ్చి సర్ ఈ సమ్ కరెక్టేనా అని అడగడంతో కరెక్టే కదా అని చెప్పగా మరి వసుధార మేడం అందరికీ తప్పని ఇంటు మార్క్ వేసింది నాకు ఒక్కరికే కాదు అందరికీ ఇలాగే వేసింది మేడం ఎందుకో డల్ గా ఉన్నారు ఏమైందో కనుక్కుందామని వచ్చాము అని పాండియన్ చెబుతాడు.
సరే ఏమైందో నేను కనుక్కుంటాను నువ్వు వెళ్ళు అని రిషి చెప్పి ఏం జరిగిందో అని ఆరాటపడుతూ చక్రపాణి వద్దకు వెళ్తారు. వసుదార ఎందుకో డల్ గా ఉంది చెప్పండి. ఉదయం నుంచి చాలా డల్ గా ఉంది జగతి మేడం లేదా మా డాడ్ ఏమైనా తనకు ఫోన్ చేశారా అని చక్రపాణిని అడుగుతాడు. దాంతో చక్రపాణి తను ఎందుకు బాధ పడుతుందో మీకు తెలుసు కదా బాబు బాబు తను చేసినది తప్పు తన మీ మనసును చాలా గాయపరిచింది. తను మీ గురించి ఆలోచించి మీ జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఉంటుంది అందుకే అలా ఉందనీ చెబుతాడు చక్రపాణి మాట్లాడుతూ వసమ్మ గురించి మీకన్నా ఎవరికీ బాగా తెలిసే ఉండదు కదా అంటూ చక్రపాణి మాట్లాడతారు.
మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?