ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన లేడీ డైరెక్టర్-హీరో పెళ్లి వార్త.!

సినీ పరిశ్రమలో ఎవరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో కచ్చితంగా చెప్పలేం. అంచనా వేయడం కూడా చాలా కష్టం. ఓ హీరో చాలా సైలెంట్ గా అదీ రెండు నెలల క్రితమే ఓ డైరెక్టర్ ను పెళ్లాడాడు. ఆ విషయం చాలా మందికి తెలీదు. వివరాల్లోకి వెళితే.. డిసెంబర్ 9న కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో ‘విజయానంద్’ అనే పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయ్యింది. రిషిక శర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది.

వి.ఎల్.ఆర్ ట్రావెల్స్ వ్యవస్థాపకుడు విజయ్ శంకేశ్వర్ గారి బయోపిక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో హీరోగా నిహాల్ రాజ్‌పుత్ నటించాడు. కన్నడంలో యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించిన ఇతను ఆ తర్వాత హీరోగా ఎదిగాడు. అయితే దర్శకురాలు రిషిక శర్మని ఫిబ్రవరిలో ఇతను వివాహం చేసుకున్నాడట. ఈ విషయం అతి తక్కువ మందికి మాత్రమే తెలుసట. వీరిద్దరూ 9 ఏళ్ళుగా ప్రేమించుకున్నారట. వారి రిలేషన్ కూడా చాలా మందికి తెలీదట.

వీరి కాంబినేషన్లో రూపొందిన ‘ట్రంక్’ ‘విజయానంద్’ చిత్రాలు కన్నడలో సక్సెస్ అయినట్లు తెలుస్తుంది. ‘విజయానంద్’ సినిమాలో విజయ్ శంకేశ్వర్ పాత్ర కోసం నిహాల్ ఏకంగా 22 కేజీలు బరువు పెరిగి అందరికీ షాకిచ్చాడు. అంతకు ముందు ఇతను చాలా స్లిమ్ గా ఉండేవాడట. అయితే ‘మహానటి’ లో కీర్తి సురేష్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇతను బరువు పెరిగినట్టు ప్రమోషన్లలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ జంట చాలా హ్యాపీగా ఉన్నట్టు తెలిపింది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus