కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు. వాటిలో ఒకటి గరుడ వేగ దర్శకుడు ప్రవీణ్ సత్తారు తో చేస్తున్న సినిమా కాగా మరొకటి యువ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తో చేస్తున్న బంగార్రాజు. అయితే వీటిలో ప్రవీణ్ సత్తారు మూవీ షూటింగ్ ఇటీవల ప్రారంభమై ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతుండగా బంగార్రాజు మూవీ మొన్న అఫీషియల్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. 2016లో విడుదలై సూపర్ హిట్ కొట్టిన సోగ్గాడే చిన్నినాయన మూవీలో నాగార్జున పోషించిన బంగార్రాజు క్యారెక్టర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెల్సిందే.
అయితే అదే టైటిల్ ని ఈ సీక్వెల్ కి పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ మూవీలో ఫస్ట్ పార్ట్ ని మించేలా మరింత ఎంటర్టైన్మెంట్ యాక్షన్ సీన్స్ ఉండనున్నాయని సమాచారం. రమ్యకృష్ణ ఈ మూవీలో కూడా ముఖ్య పాత్ర చేస్తుండగా తండ్రి నాగార్జున తో కలిసి మనం మూవీ తరువాత ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు నాగ చైతన్య. ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని నాగార్జున ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
అయితే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మితం అవుతున్న ఈ సినిమాకి ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే కూడా ఒకింత ఎక్కువగానే ఖర్చు చేయనున్నారట నాగ్. మూవీలో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండియర్ యాక్షన్ సీన్స్ ఉన్నాయని, వాటి విషయమై ఏ మాత్రం కాంప్రమైజ్ కాని నాగార్జున ఖర్చు విషయంలో వెనుకాడడం లేదని అంటున్నారు. అలానే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ స్టోరీ ని ఎంతో అద్భుతంగా సిద్ధం చేసారని, తప్పకుండా సోగ్గాడే చిన్ని నాయన ని మించేలా ఈ మూవీ రేపు విడుదుల తరువాత సక్సెస్ అందుకుంటుందని ఇన్నర్ వర్గాల టాక్. త్వరలో రెగ్యులర్ షూట్ ప్రారంభం కానున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల కానున్నట్లు తెలుస్తోంది.