Rj Chaitu, Akhil: టాస్క్ ఆడకపోయినా ఆర్జే చైతూ కెప్టెన్ ఎలా అయ్యాడంటే..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో కొత్త కెప్టెన్ గా అంటే మూడోవారం కెప్టెన్ గా ఆర్జే చైతూ ఎంపిక అయ్యాడు. బిగ్ బాస్ ఇచ్చిన అంతా నా ఇష్టం అనే టాస్క్ లో యాంకర్ శివకి సీక్రెట్ టాస్క్ వచ్చింది. దీన్ని దిగ్విజయంగా పూర్తి చేశాడు శివ. శివతో పాటుగా అరియానాకి కూడా సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ దీంతో వీరిద్దరూ కెప్టెన్సీ పోటీదారులు అయ్యారు. అయితే, ఇక్కడే ఓటింగ్ ద్వారా సీక్రెట్ టాస్క్ ఇచ్చిన వ్యక్తి ఎవరో చెప్పమని బిగ్ బాస్ అడిగినపుడు శివ పేరుని నలుగురు గెస్ చేశారు.

Click Here To Watch Now

వీళ్లలో అషూరెడ్డి, హమీదా, ఆర్జే చైతూ ఇంకా అజయ్ లు ఉన్నారు. ఇక వరుసగా రెండువారాల పాటు కెప్టెన్సీ పోటీదారుడు అయిన అనిల్ కూడా కెప్టెన్సీ టాస్క్ లో పోటీ పడ్డాడు. వీళ్లని కూడా కెప్టెన్సీ పోటీదారులని చేశాడు బిగ్ బాస్. ఇక వీళ్లకి వివిధ కెప్టెన్సీటాస్క్ లని ఇచ్చాడు. ఫస్ట్ రౌండ్ లో అరియానా అవుట్ అయ్యింది. నెక్ట్స్ రౌండ్ లో అషూరెడ్డి, హమీదాలు అవుట్ అయ్యారు. ఇక్కడే అషూరెడ్డి బాగా ఎమోషనల్ అయిపోయింది.

కెప్టెన్సీ టాస్క్ ఛాన్స్ వచ్చినపుడు గెలవలేదని ఫీల్ అయ్యింది. ఆ తర్వాత రౌండ్ లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో పార్టిసిపెంట్స్ బదులుగా వేరేవారిని ఎంచుకోవాల్సి వచ్చింది. ఆర్జే చైతూ, శివ బదులుగా అనిల్ ఇంకా అఖిల్ ఇద్దరూ టాస్క్ ఆడారు. వీరితో పాటుగా అజయ్ కూడా పోటీపడ్డాడు. పెద్ద పెద్ద దుంగలని తాడుతో బ్యాలన్స్ చేస్తూ పడిపోకుండా చూసుకోవాలి. ఇందులో బిగ్ బాస్ మూడో లెవల్స్ పెట్టాడు. ఫస్ట్ లో అజయ్ స్ట్రాంగ్ గా కనిపించినా ఎక్కువసేపు నిలవలేకపోయాడు.

లాస్ట్ వరకూ అనిల్ అఖిల్ నువ్వా నేనా అన్నట్లుగా ఈ టాస్క్ ఆడారు. ఫైనల్ గా అఖిల్ గెలిచేసరికి ఆర్జే చైతూ విన్నర్ అయ్యాడు. ఆర్జే చైతూ అఖిల్ ని ఎంచుకోవడం అనేది ప్లస్ పాయింట్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ లో మూడోవారం కెప్టెన్ గా ఆర్జే చైతూ ఎంపిక అయ్యాడు. మొదటివారం తేజస్వి, రెండోవారం అనిల్ కెప్టెన్ అయిన సంగతి తెలిసిందే. అయితే, రెండోవారం హౌస్ మేట్స్ ఇంటి నియమాలు ఉల్లంఘించిన కారణంగా అనిల్ కెప్టెన్సీని రద్దు చేశాడు బిగ్ బాస్. మరి ఆర్జే చైతూ ఎలా ఇంటిని మేనేజ్ చేస్తాడో చూడాలి.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus