Rk Sagar: రాంచరణ్ ఇండస్ట్రీ హిట్ సినిమాలో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్న సాగర్..!

‘మొగలి రేకులు’ లో ఆర్.కె.నాయుడు అనే పోలీస్ ఆఫీసర్ రోల్ తో బాగా పాపులర్ అయిన సాగర్… తర్వాత హీరోగా మారి ‘షాదీ ముబారక్’ వంటి సినిమాలు చేశాడు. హీరోగా అతనికి రావాల్సిన గుర్తింపు అయితే రాలేదు. ఇంకా ‘మొగలి రేకులు’ సాగర్ గానే పిలవబడుతూ వస్తున్నాడు. అతను హీరోగా ‘ది 100’ అనే సినిమా రూపొందింది. ఇందులో అతను మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించాడు.

Rk Sagar

జూలై 11న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో సాగర్ తన సినీ కెరీర్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు. తాజాగా అతను ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్నట్టు తెలిపి షాకిచ్చాడు.

సాగర్ మాట్లాడుతూ… ” ‘రంగస్థలం’ లో రాంచరణ్ అన్నయ్య పాత్రకి దర్శకులు సుకుమార్ గారు నన్ను సంప్రదించారు. ఆ టైంలో ‘మిస్టర్ పర్ఫెక్ట్’ వల్ల బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అది ఆయనకి చెప్పాను. ‘నాకు చెప్పిన పాత్రని మార్చేసి ఇబ్బంది పెట్టారండీ, అప్పటి నుండి నాకు క్యారెక్టర్స్ చేయాలంటే ఇన్-సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది’ అని..! అయితే ఆయన లేదు లేదు… ఇందులో ఆ పాత్రని మార్చడానికి లేదు అని అన్నారు.

నాకు ఆ టైంలో తెలిసింది ఏంటంటే.. ‘ఆది పినిశెట్టి గారు ఆ పాత్ర చేయడానికి నో చెప్పారు’ అని..! దీంతో కొంచెం టైం తీసుకుని చెబుతానని చెప్పాను. తర్వాత బాగా ఆలోచించుకుని సుకుమార్ గారికి ఫోన్ చేసి ఓకే చెబుదామని అనుకున్నాను. కానీ అదే టైంకి ఆది పినిశెట్టి కూడా ఓకే చెప్పేశారట. అలా ఆ పాత్రను మిస్ చేసుకున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

ఆగస్టు… నాగవంశీకి పెద్ద పరీక్షే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus