Robo Collections: ‘రోబో’ కి 11 ఏళ్ళు.. తెలుగులో ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా ఇండియన్ జేమ్స్ కామెరూన్ గా పేరు సంపాదించుకున్న శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ ‘రోబో’. నిర్మాత కళానిధిమారన్ ఈ చిత్రాన్ని తన సన్ పిక్చర్స్ బ్యానర్ పై సుమారు రూ.142 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. సౌత్ లో అంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం అప్పటికి ఇదే కావడం విశేషం. 2010 వ సంవత్సరం అక్టోబర్ 1న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. తొలిరోజే ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రతీ ఫ్రేమ్ లోనూ రిచ్ నెస్ కొట్టొచ్చినట్టు కనబడుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నేటితో ఈ చిత్రం విడుదలై 11 ఏళ్ళు పూర్తికావస్తోంది.

మరి తెలుగులో ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 14.85 cr
సీడెడ్  6.83 cr
ఉత్తరాంధ్ర  3.77 cr
ఈస్ట్  2.44  cr
వెస్ట్  2.25 cr
గుంటూరు  3.16 cr
కృష్ణా  2.19 cr
నెల్లూరు  1.58 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 37.07 cr

 

తెలుగురాష్ట్రాల్లో ‘రోబో’ చిత్రాన్ని ఆ రోజుల్లోనే రూ.19 కోట్లకి విక్రయించారు. అయితే ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం ఏకంగా రూ.37.07 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే దాదాపు డబుల్ ప్రాఫిట్స్ అన్న మాట. ఇక తెలుగు వెర్షన్ మొత్తం కలుపుకుంటే ‘రోబో’ రూ.40 కోట్ల పైనే షేర్ ను నమోదు చేసిందని ట్రేడ్ పండితుల సమాచారం.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus