KGF Chapter 1 Re-release: ‘కేజీఎఫ్’ సడన్ రీ రిలీజ్.. కాస్త ముందే చెప్పొచ్చుగా!

‘కేజీఎఫ్ చాప్టర్ 1’ (KGF Chapter 1) కచ్చితంగా ఓ గేమ్ ఛేంజర్ (Game Changer) మూవీ. మాస్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన మూవీ కూడా అని చెప్పవచ్చు. దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel)..ను, హీరో యష్..ని (Yash) ఒక్కసారిగా దేశవ్యాప్తంగా స్టార్స్ ని చేసిన ఈ ‘కే.జి.ఎఫ్ చాప్టర్ 1’ లో ఎలివేషన్స్ ఓ రేంజ్లో ఉంటాయి. రవి బస్రూర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే ఇప్పటికీ మార్మోగుతూనే ఉంది. ‘కేజీఎఫ్ చాప్టర్ 1’ వల్ల టాలీవుడ్లో కూడా ప్రశాంత్ నీల్ కి డిమాండ్ పెరిగింది.

ఇదిలా ఉండగా.. ఇప్పుడు రీ రిలీజ్..ల హవా ఊపందుకున్న క్రమంలో ‘కేజీఎఫ్ చాప్టర్ 1 ‘ ని కూడా రీ రిలీజ్ చేయాలని అభిమానులు కోరుకున్నారు. అయితే చాలా సైలెంట్ గా ఈరోజు అనగా జూన్ 21 న ‘కేజీఎఫ్ చాప్టర్ 1 ‘ రీ రిలీజ్ అయ్యింది. ఈ మధ్య రీ రిలీజ్ అయ్యే సినిమాలకి కూడా ఈవెంట్లు పెట్టి మరీ బజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. అలాంటిది బోలెడంత మంది ఫ్యాన్స్ కోరుకుంటున్న ‘కేజీఎఫ్ చాప్టర్ 1 ‘ రీ రిలీజ్ ను ఇంత సింపుల్ గా ప్లాన్ చేయడం వారికి షాక్ ఇచ్చింది.

పోనీ ఎక్కువ స్క్రీన్స్ లో అయినా రీ రిలీజ్ అయ్యిందా అంటే అదీ లేదు.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సుదర్శన్ థియేటర్ లో మాత్రమే షోలు ఉన్నాయి. ఈరోజు మినిమమ్ బజ్ ఉన్న సినిమాలు కూడా రిలీజ్ అవ్వడం లేదు. అలాంటప్పుడు సోషల్ మీడియాలో అయినా ‘కే.జి.ఎఫ్’ రిలీజ్ అవుతుందని కొన్ని పోస్టులు వేసినా.. ఈరోజు టికెట్లు తెగేవి. అలా చేయలేదు కాబట్టి.. కచ్చితంగా ఇది రాంగ్ ప్లానింగ్ అనే చెప్పాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus