Rohith: బ్యాటరీ టాస్క్ లో జరిగింది ఇదే..! రోహిత్ కోసం మెరీనా ఏం చేసిందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో ఆరోవారం కెప్టెన్సీ రేస్ టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా హౌస్ మేట్స్ కి ఇచ్చిన బ్యాటరీ జీరో పర్సెంట్ వచ్చింది. దీంతో బిగ్ బాస్ వాసంతీ – రోహిత్ ఇద్దరి మద్యలో ఒక టాస్క్ ఇచ్చాడు. రానున్న రెండువారాల పాటు నేరుగా ఎవరైతే నామినేట్ అవుతారో బిగ్ బాస్ కి చెప్తే, బ్యాటరీ రీఛార్జ్ 100శాతం పెరుగుతుందని చెప్పాడు. దీంతో వాసంతీ ఇంకా రోహిత్ ఇద్దరూ డిస్కషన్ పెట్టారు. వాసంతీ అయితే లాస్ట్ వీక్ నేను నామినేట్ అయి సేఫ్ అయి వచ్చానని, మళ్లీ సెల్ఫ్ నామినేట్ అయితే కష్టమని చెప్పింది.

ఎట్టిపరిస్థితుల్లోనూ నామినేషన్స్ లో ఉండనని నిక్కచ్చిగా చెప్పేసింది. ఇక చేసేదేమీ లేక రోహిత్ నేను నామినేట్ అవుతానని చెప్పాడు. దీంతో హౌస్ మేట్స్ కి 100శాతం రీఛార్జ్ వచ్చింది. కానీ, ఎవరికైతే కాల్స్ రాలేదో వాళ్లు కనీసం రోహిత్ పట్ల కన్సర్న్ కూడా చూపించలేదు. ముందు టెలిఫోన్ బూత్ లోకి ఎవరు వెళ్లాలి అనేది మాత్రమే డిస్కస్ చేసుకున్నారు. వాసంతీ అయితే వెంటనే సూర్య, ఫైమా, రేవంత్ , రాజ్ లతో కలిసి ఎవరు ముందుగా టెలిఫోన్ ని తీస్కోవాలి. ఎవరు తర్వాత తీస్కోవాలనేది వంతులు వేసుకున్నారు. దీంతో రోహిత్ అసహనాన్ని చూపించాడు.

తన భార్య మెరీనాతో మాట్లాడుతూ చూశావా హౌస్ మేట్స్ కనీసం మనల్ని అడగట్లేదు. రెండువారాలు నామినేట్ అయినా కూడా వాళ్లు స్వార్ధంగా గేమ్ ఆడుతున్నారంటూ వాపోయాడు. నిజానికి రోహిత్ రెండు వారాలు నామినేట్ అవ్వను అంటే ఏం జరిగేదో తెలుసుకోవాల్సింది. తన మంచి మనసుతో హౌస్ మేట్స్ కి ఇంటి నుంచీ కాల్స్ రావాలనే ఉద్దేశ్యంతో నామినేట్ అవ్వడానికి ఒప్పుకున్నాడు. తప్పు చేశాడు. ఇక ముందు ఫోన్ ఎత్తిన రేవంత్ తన భార్య ఫోటోని కోరుకున్నాడు. ఆ తర్వాత ఫైమా తన మదర్ వీడియో కాల్ ఎంచుకుంది. ఫైమా మదర్ ని చూసిన హౌస్ మేట్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు.

తర్వాత సూర్య వాళ్ల అమ్మ దగ్గర్నుంచీ వచ్చిన లెటర్ ని తీస్కున్నాడు. ఆ తర్వాత రాజ్ వాళ్ల అమ్మగారితో ఫోన్ కాల్ మాట్లాడాడు. దీంతో 100శాతం బ్యాటరీ పూర్తి అయిపోయింది. కానీ, రోహిత్ – మెరీనాలకి మాట్లాడే అవకాశం రాలేదు.
ఆ తర్వాత కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ మొదలైంది. గార్డెన్ ఏరియాలో ఉన్న 8 బాల్స్ ని దక్కించుకుని ఎవరి బాస్కెట్ లో అయితే కాపాడుకుంటారో వాళ్లు కెప్టెన్సీ పోటీదారులు అవుతారని చెప్పాడు బిగ్ బాస్. దీనికోసం హౌస్ మేట్స్ ఎగబడ్డారు. లాస్ట్ లో మెరీనా, బాలాదిత్య, కీర్తి, రోహిత్ నలుగురు బాల్ కోసం బాగా కొట్లాడారు.

ఫైనల్ గా సుదీప బాల్ ని లాక్కుని రోహిత్ బాస్కెట్ లో వేసింది. దీంతో రోహిత్ ఈవారం కెప్టెన్సీ పోటీదారుడిగా నిలిచాడు. ఇక మెరీనా రోహిత్ కోసం చాలాసేపు తోటి హౌస్ మేట్స్ తో బాల్ కోసం కొట్లాడింది. అంతేకాదు, మీకోసం రోహిత్ నామినేట్ అయ్యాడంటూ మాట్లాడింది. రోహిత్ కోసం చాలాసేపు వాళ్లతో పోట్లాడింది కూడా. ఫైనల్ గా రోహిత్ కెప్టెన్సీ పోటీదారుడు అయ్యేసరికి కాస్త హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇక రేపటి టాస్క్ లో ఈవారం ఎవరు కెప్టెన్ అవుతారు అనేది ఆసక్తికరం. అదీ మేటర్.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus