Roja: మహేష్ సినిమాలో నటించాలని ఆశిస్తున్న రోజా.. కోరిక తీరుతుందా?

ప్రముఖ నటి రోజా ప్రస్తుతం రాజకీయ కారణాల వల్ల సినిమాలకు దూరంగా ఉన్నారు. 2024 ఎన్నికల తర్వాత రోజా పరిస్థితులకు అనుగుణంగా రీఎంట్రీ విషయంలో నిర్ణయం తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. అయితే రోజా తాజాగా ఒక రెస్టారెంట్ ఓపెనింగ్ కు హాజరయ్యారు. రెస్టారెంట్ ఓపెనింగ్ అనంతరం రోజా మాట్లాడుతూ సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించాలని నాకు కోరిక అని చెప్పుకొచ్చారు. అయితే మహేష్ బాబుకు అమ్మ, అత్త పాత్రలలో మాత్రం తాను నటించబోనని రోజా కామెంట్లు చేశారు.

మహేష్ బాబుకు అక్క, వదిన పాత్రలలో నటించాలని ఉందని రోజా తన మనస్సులోని కోరికను చెప్పుకొచ్చారు. అయితే మహేష్ బాబు తలచుకుంటే మాత్రం రోజా కోరిక తీరడం కష్టం కాదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో చూడాలి. రోజా పలు సందర్భాల్లో వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నా మరికొన్ని సందర్భాల్లో మాత్రం మంచి మనస్సును చాటుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.

జబర్దస్త్ పంచ్ ప్రసాద్ కు రోజా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విషయంలో ఎంతో సహాయం చేశారు. (Roja) రోజా 2024 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేయనున్నారు. నగరి నియోజకవర్గంలో పాజిటివ్ ఫలితాలు వస్తాయని ఆమె ఫీలవుతున్నారని తెలుస్తోంది. మహేష్ బాబు కెరీర్ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో, భారీ లెవెల్ లో తెరకెక్కుతుండగా సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

2024 సంక్రాంతి విన్నర్ గుంటూరు కారం అని నెటిజన్లు ఫీలవుతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో గుంటూరు కారం మూవీ తెరకెక్కుతుండగా ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. త్రివిక్రమ్ మరోసారి ఈ సినిమాతో మ్యాజిక్ చేస్తారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus