లియో చిత్రంలో నటుడు మన్సూర్ అలీ ఖాన్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆంటోని దాస్ గ్యాంగ్ లో కీలక వ్యక్తిగా.. లియోకి అనుచరుడిగా మన్సూర్ నటించారు. ఇలా లియో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన తాజాగా నటి త్రిష గురించి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపుతున్నాయో మనకు తెలిసిందే. ఈ సినిమాలో త్రిషను రేప్ చేసే అవకాశం తనకు రాలేదని తెలిపారు.
ఈ సినిమాలో త్రిష నటిస్తుందనే విషయం తెలియడంతో తనతో కలిసి బెడ్ రూమ్లో రేప్ సీన్ ఉంటుందని భావించాను. కానీ ఈ సినిమాలో త్రిషతో నాకు అలాంటి సన్నివేశాలు లేవు అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి. ఇక ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే పలువురి సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ ఈయనపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈయన చేసిన ఈ వ్యాఖ్యలపై ఎంతోమంది మహిళ సెలబ్రిటీలు స్పందిస్తూ ఈయన వ్యాఖ్యలను పూర్తిగా తప్పుపడుతున్నారు.
తాజాగా సినీ నటి మంత్రి రోజా (Roja) కూడా మన్సూర్ అలీ త్రిష పట్ల చేస్తున్నటువంటి వ్యాఖ్యలపై స్పందిస్తూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఆడవారి గురించి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడే మగవారిపై కేసులు పెట్టాలి ఇలాంటి వారికి చట్ట పరంగా చాలా కఠినమైన శిక్షలు తీసుకోవాలి లేకపోతే ఈ మగాళ్లు భయపడరు అంటూ రోజా ఈయనపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా నటి త్రిషకు మద్దతు తెలియజేశారు.
నాపై దాడి చేసినటువంటి ఒక టిడిపి ఎమ్మెల్యే కావచ్చు త్రిష కుష్బూ వంటి వారిపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మన్సూర్ కావచ్చు ఎవరైనా సరే వారికి శిక్ష పడాలి అంటూ ఈమె తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా సినిమా రంగంలోనూ రాజకీయాలలోనూ మహిళలను ఎలా టార్గెట్ చేసిన మేము ఉన్నత స్థాయిలోకి ఎదుగుతున్నామని తెలియజేశారు తమ పరిస్థితి ఇలాగే ఉంటే సామాన్య మహిళలు ఇలాంటి వారిని కలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోలేం అంటూ రోజా ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.