Mla Roja: రోజా నిరీక్షణ ఫలించింది అందుకే టీవీ షోలకి దూరం..!

ఒకప్పటి స్టార్ హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, రాజకీయ నాయకురాలు అయిన రోజా బుల్లితెర పై కూడా బాగా సందడి చేస్తూ ఉంటుంది.ఈమెను ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గర చేసింది ఈ బుల్లితెర షోలు అనే చెప్పాలి. అయితే సడెన్ గా రోజా ఇక నుండీ టీవీ షోలు చేయను అంటూ ప్రకటించడం పట్ల కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.నిజానికి కొద్దిరోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలే ఇప్పుడు నిజం అయ్యాయి అని చెప్పాలి.

ప్రస్తుతం వైసిపి పార్టీలో ఉన్న రోజా మంత్రి పదవి లభిస్తే కనుక జబర్దస్త్ వంటి కామెడీ షోలకి ఇక నుండీ జడ్జిగా వ్యవహరించను అని తన సన్నిహితుల వద్ద చెప్పింది. అది నిజం చేస్తూ ఈరోజు ఆమె అధికారికంగా వెల్లడించింది. తాజా మంత్రివర్గ విస్తరణలో రోజాకు మంత్రి పదవి దక్కింది. మంత్రి కావాలన్న ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆమె నిరీక్షణ ఫలించింది. కాబట్టి ఇక పై ఆమె వెండితెర పై మాత్రమే కాదు బుల్లితెర పై కూడా కనిపించను అని ప్రకటించింది.

అంటే ఇక రోజా సినిమాల్లో కానీ టీవీ షోలలో కానీ కనిపించదన్న మాట.మంత్రిగా ఉండి సినిమాలు చెయ్యడం సరైన పద్దతి కాదని… టీవీ షోలు చేసే టైం కూడా ఉండకపోవచ్చని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపింది. సీఎం జగన్ ద్వారా లభించిన గుర్తింపుని ఎప్పటికీ మర్చిపోనని…. ఆయన తన పై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయనంటూ, అహర్నిశలు కష్టపడి పని చేస్తాను అంటూ ఆమె సెలవిచ్చింది. భవిష్యత్తులో ఆమె మళ్ళీ సినిమా పరిశ్రమ వైపు వస్తుందా లేదా అనే విషయం మాత్రం ప్రస్తుతానికైతే సస్పెన్స్.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus