Roja, Pawan: ప్యాకేజీ కోసమే పవన్ బాలయ్య షో కి వచ్చారు.. రోజా షాకింగ్ కామెంట్స్!

నందమూరి నటసింహం బాలకృష్ణ ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. బాలకృష్ణ ఇప్పటికీ వరుస సినిమాలలో నటించడమే కాకుండా ఆహా వేదికగా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ టాక్ షోలో హోస్ట్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే మొదటి సీజన్ కంప్లీట్ చేసుకున్న ఈ టాక్ షో.. ప్రస్తుతం రెండవ సీజన్ కొనసాగుతోంది. ఈ రెండవ సీజన్లో ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు అతిధులుగా పాల్గొని బాలకృష్ణతో కలిసి సందడి చేశారు. ముఖ్యంగా ఈ షోలో ప్రభాస్ పాల్గొనడంతో ప్రభాస్ అభిమానులు తెగ సంబర పడుతున్నారు.

ఎప్పుడు రియాలిటీ షోలకు దూరంగా ఉండే ప్రభాస్ ఇలా బాలకృష్ణ షోలో సందడి చేయటం కొంతవరకు అభిమానులకు ఆశ్చర్యంగా ఉంది.ఇదిలా ఉండగా మొదటిసారిగా బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ఈ అన్ స్టాపబుల్ షోలో మెగా హీరో సందడి చేయబోతున్నాడు అని తెలియటంతో మెగా అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఎప్పుడు రియాలిటీ షోలకు దూరంగా ఉండే పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో కి గెస్ట్ గా రావటంతో అటు నందమూరి అభిమానులతో పాటు ఇటు మెగా అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయినట్లు సమాచారం. ఈ షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా బాలకృష్ణ షో కి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా హాజరు కావడంపై లేడీ ఫైర్ బ్రాండ్ రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు రియాలిటీ షోలకు దూరంగా ఉండే పవన్ కళ్యాణ్ తనకి బద్ధ శత్రువుగా భావించే బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో కి వెళ్లడంపై చంద్రబాబు హస్తం ఉందని రోజా విమర్శించారు.

గతంలో బాలయ్య మెగా హీరోలు మెగా అభిమానులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే మెగా బ్రదర్ నాగబాబు కూడా బాలకృష్ణ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇలా ఒకరిపై ఒకరు బురద చల్లుకున్న వీళ్లు ఇపుడు ఏ ఉద్దేశ్యంతో కలిసారని ఏపీ మంత్రి రోజా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబుతో పొత్తు కలుపుకోవటానికి ప్రయత్నంగా ఈ షో కి హజరయ్యడని, ఇది కూడా ప్యాకేజీలో భాగమేనని రోజా విమర్శించారు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus