సాధారణంగా సినిమా హీరోయిన్ల జీవితాల్లో ఎటువంటి కష్టాలు ఉండవని సాధారణ ప్రేక్షకులు భావిస్తారు. అయితే నటి రోజా మాత్రం తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తనపై చాలా సందర్బాల్లో వ్యక్తమవుతున్న విమర్శలకు సైతం రోజా తాజాగా ప్రసారమైన ఊరిలో వినాయకుడు ఈవెంట్ ద్వారా స్పష్టత ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన సమయంలో చేదు అనుభవాలు ఎదురయ్యాయని రోజా తెలిపారు. డ్యాన్స్ రాదని, డైలాగ్స్ సరిగ్గా చెప్పడం లేదని నెగిటివ్ కామెంట్లు రావడంతో ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలని అనుకున్నానని రోజా పేర్కొన్నారు.
అయితే సెల్వమణి డైరెక్షన్ లో తాను నటించిన చామంతి సక్సెస్ తో వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదని రోజా కామెంట్లు చేశారు. డాక్టర్లు పిల్లలు పుట్టరని చెప్పిన తర్వాత దేవుడు ఇంత పెద్ద శిక్ష విధించాడని బాధ పడ్డానని రోజా అన్నారు. అయితే ఆ తర్వాత తనకు ప్రెగ్నెన్సీ వచ్చి అన్షు పుట్టిందని తనకు అన్షు దేవుడు ఇచ్చిన వరం అని భావిస్తానని రోజా తెలిపారు. మళ్లీ గర్భవతి అయిన సమయంలో ఆరోగ్య సమస్యలు వచ్చాయని ఫ్రెండ్స్ హాస్పిటల్ లో రెండు నెలలు చికిత్స చేయించుకున్నానని రోజా అన్నారు.
ఆ రెండు నెలలు స్నానం కూడా చేయలేదని రెండు కాళ్లు పైకి పెట్టించి అబార్షన్ కాకూడదని చికిత్స చేయగా 7వ నెలలోనే కౌశిక్ పుట్టాడంటూ జీవితంలో ఎదురైన కన్నీటి కష్టాలను రోజా వెల్లడించారు. ఎన్నికల్లో విజయం సాధించిన సమయంలో ఆనంద భాష్పాలు వచ్చాయని రోజా పేర్కొన్నారు.