Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్
- September 12, 2026 / 11:38 PM ISTByPhani Kumar
‘మేమ్ ఫేమస్’ ‘గోదారి గట్టుపైన’ వంటి డీసెంట్ హిట్లతో ఫామ్లో ఉన్న హీరో సుమంత్ ప్రభాస్. ‘అర్జున్ రెడ్డి’ ‘కబీర్ దాస్’ ‘యానిమల్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో సూపర్ ఫామ్లో ఉన్న ‘భద్రకాళి పిక్చర్స్’ అధినేత(నిర్మాత) ప్రణయ్ రెడ్డి వంగా. ‘మ్యాడ్’ ‘8 వసంతాలు’ ఫేమ్ ఆనంతిక హీరోయిన్. వీరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుంది అంటే సహజంగానే అంచనాలు ఏర్పడతాయి. దానికి తోడు సందీప్ రెడ్డి వంగా సమర్పకుడు అయితే ఆ అంచనాలు రెట్టింపు అవుతాయి.
Romanchakam

అలా వీరి కాంబినేషన్లో రూపొందిన ‘రోమాంచకం'(Romanchakam) సినిమా రిలీజ్ కి ముందు మంచి బజ్ ను సొంతం చేసుకుంది. ప్రభాస్ కూడా ఈ సినిమాకి తన వంతు ప్రమోషనల్ పుషింగ్ ఇచ్చాడు. అయితే సినిమా ప్రీమియర్స్ తోనే సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ పర్వాలేదు అనిపించే రేంజ్లో ఓపెనింగ్స్ వచ్చాయి. వీక్ డేస్ లో మాత్రం బాగా డౌన్ అయ్యింది. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 1.90 cr |
| సీడెడ్ | 0.17 cr |
| ఆంధ్ర(టోటల్) | 0.90 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 2.97 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా(తెలుగు వెర్షన్) | 0.32 cr |
| ఓవర్సీస్(తెలుగు వెర్షన్) | 0.71 cr |
| వరల్డ్ వైడ్ టోటల్ | 4 cr(షేర్) |
‘రోమాంచకం’ చిత్రం రూ.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.4 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కొరకు మరో రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. సందీప్ రెడ్డి వంగా బ్రాండ్ కారణంగా ల్యాంగ్ వీకెండ్ ను చాలా బాగా క్యాష్ చేసుకుంది. అయితే వీక్ డేస్లో కూడా మాత్రం డౌన్ అయ్యింది.














