Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

  • September 3, 2026 / 10:15 AM ISTByFilmy Focus Desk
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సుమంత్ ప్ర‌భాస్‌ (Hero)
  • అనంతిక స‌నీల్ కుమార్‌ (Heroine)
  • న‌రేంద్ర ర‌వి, వెంక‌టేష్ కాకుమాను, మ‌ణి ఎగుర్ల‌, ఉపేంద్ర లిమాయో త‌దిత‌రులు (Cast)
  • వేణుగోపాల్ రెడ్డి (Director)
  • ప్ర‌ణ‌య్ రెడ్డి వంగా (Producer)
  • వాసుకీ వైభ‌వ్‌ (Music)
  • ప‌వ‌న్ ప‌ప్పుల‌ (Cinematography)
  • వేణుగోపాల్ రెడ్డి (Editor)
  • Release Date : 3rd సెప్టెంబ‌ర్‌ 2026
  • భ‌ద్ర‌కాళి పిక్చ‌ర్స్‌ (Banner)

అర్జున్ రెడ్డి, యానిమ‌ల్ సినిమాల ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌డంతో రొమాంచ‌కం (Romanchakam) సినిమాపై తెలుగు ఆడియెన్స్‌లో ఆస‌క్తి ఏర్ప‌డింది. సుమంత్ ప్ర‌భాస్‌, అనంతిక స‌నీల్ కుమార్ జంట‌గా న‌టించిన ఈ సినిమాకు వేణుగోపాల్ రెడ్డి ద‌ర్వ‌క‌త్వం వ‌హించాడు. సందీప్ రెడ్డి వంగా సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగా నిర్మించిన రోమాంచకం గురువారం థియేట‌ర్ల‌లో రిలీజైంది. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే?

Romanchakam Movie Review

క‌థ‌: అన్వేష్ (Sumanth Prabhas) స్నేహితుల‌తో బ‌లాదూర్‌గా తిరుగుతూ అప్పులు చేస్తూ జీవితాన్ని గ‌డుపుతుంటాడు. ఓ డేటింగ్ యాప్‌లో అత‌డికి మైథిలి (Ananthika Sanilkumar) ప‌రిచ‌య‌మ‌వుతుంది. ఇద్ద‌రి అభిప్రాయాలు క‌ల‌వ‌డంతో ప్రేమించుకుంటారు. అన్వేష్‌ను క‌ల‌వ‌డానికి మైథిలి హైద‌రాబాద్ వ‌స్తుంది. తానో స్టార్ట‌ప్ కంపెనీ పెట్టాన‌ని, త‌న‌కు హైద‌రాబాద్‌లో పెద్ద ఫ్లాట్ ఉంద‌ని మైథిలికి అబ‌ద్దం చెబుతాడు అన్వేష్‌. ఓ స్నేహితుడి ఫ్లాట్‌లో ఆమెను ఉంచుతాడు. స‌డెన్‌గా మైథిలి అదృశ్య‌మ‌వుతుంది. ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని అన్వేష్ భ‌య‌ప‌డిపోతాడు. ఆ త‌ర్వాత ఏమైంది? మైథిలి మ‌ళ్లీ అన్వేష్‌కు క‌నిపించిందా? అన్వేష్ భ‌య‌ప‌డిన‌ట్లుగా ఆత్మ‌హ‌త్య చేసుకుందా? చింటుతో (న‌రేంద్ర ర‌వి) పాటు మిగిలిన స్నేహితుల వ‌ల్ల అన్వేష్ ప్రేమ‌క‌థ‌కు ఎలాంటి క‌ష్టాలు ఎదుర‌య్యాయి? ఎస్ఐ నంజుడ‌ప్ప (ఉపేంద్ర లిమాయో) అన్వేష్‌తో పాటు అత‌డి స్నేహితుల‌ను ఎందుకు అరెస్ట్ చేశాడు? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

న‌టీన‌టుల ప‌నితీరు: ఎలాంటి బ‌రువు బాధ్య‌త‌లు లేకుండా జులాయిగా తిరిగే యువ‌కుడి పాత్ర‌కు ప‌ర్‌ఫెక్ట్‌గా యాప్ట్ అయ్యాడు సుమంత్ ప్ర‌భాస్‌ (Sumanth Prabhas). త‌న కామెడీ టైమింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు. త‌మిళ అమ్మాయిగా అనంతిక స‌నీల్ కుమార్ (Ananthika Sanilkumar) సెటిల్డ్ యాక్టింగ్‌తో ఆక‌ట్టుకుంది. త‌న స్క్రీన్‌ప్ర‌జెన్స్ బాగుంది. క‌ళ్ల‌తోనే చాలా సీన్ల‌లో న‌ట‌న‌ను క‌న‌బ‌రిచింది.

రోమాంచ‌కం (Romanchakam) సినిమాకు అస‌లైన హీరోగా నిలిచాడు న‌రేంద్ర ర‌వి. త‌న కామెడీతో ఈ సినిమాకు సేవియ‌ర్‌గా మారాడు. అత‌డి ప్ర‌తి డైలాగ్ న‌వ్విస్తుంది. పోలీస్ స్టేష‌న్ ఎపిసోడ్‌తో పాటు ఉపేంద్ర లిమాయో, న‌రేంద్ర ర‌వి కాంబినేష‌న్‌లో వ‌చ్చే సీన్లు మొత్తం హిలేరియ‌స్‌గా ఆక‌ట్టుకుంటాయి. మిగిలిన స్నేహితులుగా మ‌ణిఎగుర్ల‌, వెంక‌టేష్ కాకుమాను, సాయిసోహ‌న్ ఫ‌న్ బాగానే వ‌ర్క‌వుట్ అయ్యింది. పోలీస్ ఆఫీస‌ర్‌గా ఉపేంద్ర లిమాయో న‌వ్వించాడు. హాస్పిట‌ల్ సీన్ బాగుంది. జాతిర‌త్నాలు డైరెక్ట‌ర్ అనుదీప్ గెస్ట్ రోల్ స‌ర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తుంది.

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు: జెన్‌జీ మ‌న‌స్త‌త్వాల‌ను ప్ర‌తిబింబిస్తూ చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా డైరెక్ట‌ర్ వేణుగోపాల్ రెడ్డి ఈ క‌థ‌ను రాసుకున్నారు. మెసేజ్‌, లెక్చ‌ర్స్, ఓవ‌ర్ సెంటిమెంట్ జోలికి పోకుండా ప్రారంభం నుంచి ముగింపు వ‌ర‌కు ఆడియెన్స్‌ను న‌వ్వించ‌డ‌మే ధ్యేయంగా ఈ సినిమా తెర‌కెక్కించాడు. ఈ ప్ర‌య‌త్నంలో స‌క్సెస్ అయ్యాడు. వాసుకి వైభ‌వ్ మ్యూజిక్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్ల‌స్ పాయింట్‌గా నిలిచింది. రాధార‌మ‌ణ‌, అవులో అవులో పాట‌లు బాగున్నాయి.

బీజీఎమ్ రొమాంటిక్ సినిమాకు త‌గ్గ‌ట్లుగా బాగుంది. పాట‌ల్లో హీరోహీరోయిన్ల కెమిస్ట్రీని సినిమాటోగ్రాఫ‌ర్ ప‌వ‌న్ అందంగా చూపించాడు. సందీప్ వంగా సోద‌రుడు ప్ర‌ణ‌య్ వంగా త‌క్కువ బ‌డ్జెట్‌లోనే అయినా క్వాలిటీగా ఈ సినిమాను నిర్మించాడు.

విశ్లేష‌ణ‌: న‌వ్వించ‌డానికి లాజిక్‌ల‌తో ప‌ని ఉండ‌దు. మ్యాజిక్ వ‌ర్క‌వుట్ అయితే చాలు. ఈ మ‌ధ్య కాలంలో ఈ ఫార్ములాతో చాలా మంది ద‌ర్శ‌కులు సినిమాలు చేస్తున్నారు. ఈ ట్రెండ్‌లో వ‌చ్చిన మ‌రో మూవీ రోమాంచ‌కం. క‌థ ప‌రంగా సినిమాలో ఎలాంటి కొత్త‌ద‌నం లేదు. డేటింగ్ యాప్‌లో ప‌రిచ‌య‌మైన ఓ జంట ప్రేమ‌క‌థ‌, వారి మ‌ధ్య అపోహ‌లు, అభిప్రాయాభేదాల‌తో ఈ సినిమా సాగుతోంది.

హీరోహీరోయిన్లు క‌ల‌వ‌డం, విడిపోవ‌డం వెనుక పెద్ద‌గా ట్విస్ట్‌లు, ట‌ర్న్‌లు ఏం ఉండ‌వు. ల‌వ్‌స్టోరీ కంటే ద‌ర్శ‌కుడు కామెడీ మీద‌నే ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాడు.

హీరో అత‌డి ఫ్రెండ్స్ గ్యాంగ్ చేసే అల్ల‌రి ప‌నులు, వారి ప్ర‌స్టేష‌న్‌, టెన్ష‌న్ నుంచి కావాల్సినంత ఫ‌న్ జ‌న‌రేట్ అయ్యేలా సిట్యూవేష‌న్స్ క్రియేట్ చేస్తూ క‌థ‌ను ముందుకు న‌డిపించాడు. అవ‌న్నీ టైమ్‌పాస్ చేస్తాయి. ఆ ట్రాక్‌లు యూత్‌ ఆడియెన్స్‌కు బాగా క‌నెక్ట్ అవుతున్నాయి.

ల‌వ్‌స్టోరీని ఇంకాస్త ఇంట్రెస్టింగ్‌గా రాసుకుంటే బాగుండేది. హీరోహీరోయిన్లు విడిపోవ‌డానికి గ‌ల కార‌ణం సిల్లీగా అనిపిస్తుంది. హీరో రియ‌లైజ్ అయ్యే సీన్‌లో డెప్త్ మిస్స‌య్యింది. కామెడీ విష‌యంలో అద‌ర‌గొట్టిన ద‌ర్శ‌కుడు మిగిలిన ఎమోష‌న్స్ విష‌యంలో త‌డ‌బ‌డ్డాడు. హీరోయిన్ పాత్ర‌కు రాసుకున్న తీరు క‌న్ఫ్యూజింగ్‌గా ఉంది. ఈ లోపాల‌న్నింటిని కామెడీతో క‌వ‌ర్ చేశాడు డైరెక్ట‌ర్‌.

ఫోక‌స్ పాయింట్‌: రోమాంచ‌కం (Romanchakam) జెన్‌జీ కామెడీ మూవీ. నాన్ స్టాప్‌గా న‌వ్వించే మంచి టైమ్‌పాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌

రేటింగ్ : 2.5/5

[Click Here To Read in ENGLISH]

 

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananthika Sanilkumar
  • #Romanchakam Movie
  • #Sumanth Prabhas
  • #Venu Gopal Reddy

Reviews

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

trending news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

3 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

4 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

11 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

16 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

17 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

7 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

13 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

14 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

15 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version