Roshan: సుమ రాజీవ్ విడాకులపై రోషన్ షాకింగ్ కామెంట్స్?: రోషన్

తెలుగు సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సుమ కనకాల ఒకరు ఈమె యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో అద్భుతమైనటువంటి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈమె నటుడు రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక వీరి కుమారుడు రోషన్ కూడా త్వరలోనే బబుల్ గమ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో రోషన్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రోషన్ కి తన తల్లిదండ్రుల విడాకుల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు రోషన్ సమాధానం చెబుతూ అమ్మానాన్నలు విడాకులు తీసుకుని విడిపోతున్నారు అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి కానీ ఆ వార్తలను చూసి అమ్మ నాన్న సరదాగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకునేవారు. అసలు వీరు విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వస్తుంటే మీరు ఇలా నవ్వుతున్నారు ఏం జరుగుతుంది తెలియని

నేను ఏకంగా మీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారా అంటూ వారిని డైరెక్ట్గా అడిగేసానని తెలిపారు. దీంతో మా అమ్మ ఛీ ఛీ ఏం మాట్లాడుతున్నావ్ రా అలాంటిదేమీ లేదని చెప్పారు. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకుపోతున్నారని చాలా సార్లు వార్తలు వచ్చాయి. అప్పుడు చాలా గందరగోళం ఉండేదని తర్వాత ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని అర్థమైందని రోషన్ తెలిపారు.

అమ్మ నాన్నలు తరచూ గొడవ పడేవారు అంటూ కూడా వారి గురించి ఎన్నో వార్తలు వచ్చాయి కానీ అందులో ఏమాత్రం నిజం లేదు అమ్మ నాన్న ఇద్దరు కూడా గొడవపడేవారు ఎలాంటి గొడవలు అంటే నాన్న తొందరగా లేకపోతే అమ్మ తిట్టేది ఇలా వీరిద్దరి మధ్య సరదాగానే గొడవలు సాగేవని అంతకుమించి వారు విడిపోయే అంత గొడవలు ఎప్పుడు జరగలేదు అంటూ ఈ సందర్భంగా రోషన్ (Roshan) చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus