#PelliSandaD Trailer: బ్యూటీఫుల్ జోడి.. క్యూట్ లవ్ స్టొరీ

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వస్తున్న పెళ్లి సందD సినిమాతో శ్రీకాంత్ తనయుడు రోషన్ మరోసారి లాంచ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాతో శ్రీలీలా కూడా వెండి తెరకు హీరోయిన్ గా పరిచయం అవుతోంది. వీరి కాంబినేషన్లో తెరకెక్కిన పెళ్లిసందడి సినిమా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ట్రైలర్ తోనే క్లారిటీ ఇచ్చారు. గతంలో శ్రీకాంత్ నటించిన పెళ్లి సందడి సినిమా ఎలాగైతే మ్యూజికల్ హిట్ గా నిలిచిందో ఇప్పుడు రోషన్ నటించిన ఈ సినిమా కూడా అదే తరహాలో ఉంటుందని ఇదివరకే తెలియజేశారు.

నేటి తరం యువతను దృష్టిలో ఉంచుకొని సరికొత్త ప్రేమ కథను తెరకెక్కించడంలో అర్థమవుతుంది. పెళ్లి వేడుకలో అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉండే సరదా సన్నివేశాలు కుటుంబ ఆప్యాయతలు ఆట పాటలతో మంచి ఫ్యామిలీ వాతావరణం కనిపస్తోంది. ఇక పెళ్లి సందడితో ఒక్కటైన హీరో హీరోయిన్ మధ్యలో అకస్మాత్తుగా జరిగిన సంఘటన ఏమిటనేది మరొక హైలెట్ పాయింట్. హీరో నుంచి అమ్మాయి ఎందుకు దూరంగా వెళ్లింది ఎక్కడికి వెళ్లింది అనే డైలాగ్ తో సినిమాలో లవ్ పాయింట్ ను కాస్త రివీల్ చేసినట్లు అర్ధమవుతోంది.

ఇక రోషన్ కేవలం లవర్ బాయ్ గానే కాకుండా మాస్ డైలాగ్స్ తో యాక్షన్ ఫైట్స్ తో మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. సినిమాలో హీరోయిన్ శ్రీ లీలా చాలా అందంగా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో కె.రాఘవేంద్రరావు టైమింగ్ అండ్ మేకింగ్ కూడా కనిపిస్తోంది. ఆయన స్టూడెంట్ గౌరీ రొనాంకి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ సినిమా దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!


‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus