తారక్ – రాజమౌళి – రామ్‌చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్ఆర్’. ఈ సినిమా బాక్సీఫీసు దగ్గర ఎంత విజయం సాధించిందో అందరం చూశాం. సుమారు రూ. 1200 కోట్లు వసూలు చేసింది మన దేశం సినిమాల్లో బెస్ట్ మూవీల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో వచ్చాక మరిన్ని రికార్డులు బద్దలుకొడుతోంది. ఈ సినిమా జీ5, నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. జీ5లో రీజనల్ లాంగ్వేజ్ వెర్షన్ ఉండగా, నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ వెర్షన్ ఉంది. అక్కడ ఈ వెర్షన్ అద్భుతంగా పెర్ఫామ్ చేస్తోందట.
దానికి తాజా ఉదాహరణ రికార్డు. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ రికార్డు సాధించింది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ ట్విటర్‌లో అధికారికంగా ప్రకటించింది. మే 20 నుండి ‘ఆర్‌ఆర్‌ఆర్’ హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్ అందుబాటులోకి వచ్చింది. అందులో ఇప్పటివరకు 45 మిలియన్ అవర్స్ అంటే నాలుగున్నర కోట్ల గంటలు ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాను స్ట్రీమ్ చేశారట యూజర్లు. అలా నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ రికార్డు సృష్టించినట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.
ఓటీటీలో అదరగొడుతున్న సినిమా రేటింగ్స్ వెబ్‌సైట్‌లోనూ దూసుకుపోతోంది. ప్రఖ్యాత రోటెన్ టమోటాస్‌లో ఈ ఏడాది టాప్ 50 సినిమాల జాబితాలో స్థానం సంపాదించింది. ఈ క్రమంలో ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ను దాటేసిందీ సినిమా. అలా సినిమా ప్రస్తుతం 48వ స్థానంలో ఉంది. ఈ సినిమాను చూసి మంత్రముగ్ధులవుతున్న హాలీవుడ్ సెలబ్రిటీలు, సాంకేతిక నిపుణులు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని, ప్రశంసల్ని అందిస్తున్నారు. ప్రస్తుత జోరు చూస్తుంటే.. ఇది ఇంకా కొన్ని రోజులు కొనసాగేలా ఉంది.
చాలా రోజులైందిగా ఓ సారి కథ సంగతి కూడా చూసేయండి. 1920 కాలంలో బ్రిటిష్ ప్రభుత్వంలో రామరాజు (రామ్‌చరణ్) పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అధికారుల మెప్పు పొంది పదోన్నతి పొందాలనేదే అతని ఆశయం. మరదలు సీత (అలియాభట్)కి ఇచ్చిన మాట నెరవేరాలంటే ఆ లక్ష్యం సాధించాల్సిందే అని పట్టుబట్టి పని చేస్తుంటాడు. మరోవైపు గవర్నర్ స్కాట్ దొర (రే స్టీవెన్‌సన్) కుటుంబంతోపాటు ఆదిలాబాద్ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు, అక్కడ గోండు జాతికి చెందిన మల్లి అనే చిన్నారిని దిల్లీకి తీసుకెళ్లిపోతారు.
గోండు జాతికి కాపరిలాంటి భీమ్ (ఎన్టీఆర్) మల్లిని తీసుకు రావడం కోసం దిల్లీ వస్తాడు. శత్రుదుర్భేద్యమైన బ్రిటిష్ కోటని భీమ్ దాటుకుని వెళ్లగలిగాడా? అక్కడే పోలీస్ అధికారిగా పనిచేస్తున్న రామరాజుకీ, భీమ్‌కీ మధ్య ఏం జరిగింది? ఆ ఇద్దరికీ భారత స్వాతంత్ర్య పోరాటంతో సంబంధం ఏంటి? అనేదే కథ.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!