టాలీవుడ్‌లో కుర్ర స్టార్ల సినిమాలు మొదలవుతున్నాయంటే ఆలస్యం… ఫలానా బాలీవుడ్ హీరోయిన్ ఆ సినిమాలో నటిస్తుంది అంటూ… పుకార్లు వచ్చేస్తాయి. అలా వినిపించే ఒక పుకారు ఇప్పుడు నిజమవుతోంది అంటున్నారు టాలీవుడ్ పరిశీలకులు. అదే గనక నిజమైతే ఎన్టీఆర్ అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వార్త ఎన్టీఆర్- కొరటాల శివ సినిమా గురించే. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో త్వరలో ప్రారంభం కానున్న సినిమా గురించే ఈ వార్త అంతా.
తారక్ – కొరటాల కాంబోలో ఓ సినిమా ఉంటుంది. అన్నీ బాగుంటే ఈ పాటికి సినిమా మొదలైపోయేది కూడా. అయితే కరోనా పరిస్థితులు తదితర కారణాల వల్ల సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. ఓవైపు తారక్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ పనుల్లో బిజీగా ఉండగా, మరోవైపు కొరటాల శివ ‘ఆచార్య’ పనుల్లో తలమునకలై ఉన్నాడు. అయితే ఇక ఆలస్యం చేయకుండా సినిమా పనులు ప్రారంభించేయాలని ఫిక్స్ అయ్యారట. దాని కోసమే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు షురూ చేశారట. అందులో భాగంగానే సినిమా కథానాయిక ఎంపిక విషయాన్ని తేల్చేయాలని అనుకుంటున్నారని టాక్.
ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే ముగ్గురి పేర్లు కనిపిస్తాయి. అందులో ఒకటి అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాహ్నవి, రెండోది ‘ఆర్‌ఆర్ఆర్’ సీత ఆలియా భట్, ఇక మూడోది ఎక్కువగా విపిపించిన పేరు కియారా అడ్వాణీ. అయితే నాయిక విషయంలో చిత్రబృందం ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఈ విషయంలో సీతకే ఓటేశారని సమాచారం. ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రచారంలో ఇద్దరి స్క్రీన్ ప్రజెన్స్ చూసి అభిమానులు ఈ ఫ్రేమ్ ఫిక్స్ అయితే బాగుండు అనుకున్నారు.
అలా అనుకున్ననప్పుడు తథాస్తు దేవతలు తథాస్తు అనేశారని టాక్. అందుకే ఇప్పుడు కొరటాల సినిమాలో తారక్ – ఆలియా కలసి నటించబోతున్నారని పుకార్లు బలంగా వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంలో అధికారిక ప్రకటన ఉండనుందని సమాచారం. మరోవైపు ఈ సినిమా రివేంజ్ డ్రామాగా రూపొందుతుందనే పుకార్లూ వస్తున్నాయి. కొరటాల పూర్తిస్థాయి కథ మాస్ ప్లాట్ రాసుకున్నారట. అంతేకాదు ఈ సినిమాను ఇతర లాంగ్వేజెస్‌లో కూడా విడుదల చేయాలని చూస్తున్నారట. అందుకే ఇతర భాషా పరిశ్రమల ప్యాడింగ్ అని తెలుస్తోంది.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!