RRR, KGF2: అలా రికార్డులు క్రియేట్ చేసిన ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2!

కేవలం మూడు వారాల గ్యాప్ లో విడుదలైన ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా 2200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి. ఫుల్ రన్ లో ఈ రెండు సినిమాల కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. ఈ రెండు సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ కు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

గతరెండు నెలల్లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కలెక్షన్లు 3,000 కోట్ల రూపాయలు కాగా ఈ మొత్తంలో మెజారిటీ వాటా సౌత్ సినిమాలదే కావడం గమనార్హం. ది కశ్మీర్ ఫైల్స్, గంగూభాయ్ కతియావాడి సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను సాధించాయి. బాలీవుడ్ పై సౌత్ సినిమాలు డామినేషన్ చూపించాయి. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాల విజయాలతో మరిన్ని భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి.

ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లకు పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు దక్కగా కేజీఎఫ్2 సక్సెస్ తో పాన్ ఇండియా హీరోగా యశ్ రేంజ్ మరింత పెరిగిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ స్టార్ హీరోల తర్వాత సినిమాలు సైతం పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కనున్నాయనే సంగతి తెలిసిందే. ఈ సినిమాల విజయాలతో రాజమౌళి, ప్రశాంత్ నీల్ దర్శకులుగా తమ స్థాయిని పెంచుకున్నారు.

ఈ స్టార్ డైరెక్టర్లు ప్రస్తుతం అంచనాలకు అందని స్థాయిలో రెమ్యునరేషన్ ను అందుకుంటూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి, ప్రశాంత్ నీల్ తర్వాత సినిమాలతో కూడా సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాజమౌళి తర్వాత సినిమాలో మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా ప్రశాంత్ నీల్ తర్వాత సినిమాలో ప్రభాస్ నటిస్తున్నారు. ఈ సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus