‘ఆర్.ఆర్.ఆర్’ లేటెస్ట్ అప్డేట్..!

‘అరవింద సమేత’ చిత్రం తర్వాత రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో నటిస్తున్నాడు జూ.ఎన్టీఆర్. ఈ చిత్రంలో చరణ్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జులై 30 2020 న విడుదల చేస్తున్నట్టు రాజమౌళి ఇటీవల తెలిపాడు. ఇక మే 20 న ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో ఆయనకు అలాగే అయన ఫ్యాన్స్ కు ఓ సర్‌ప్రైజ్‌ ఇవ్వాలని ప్లాన్‌ చేస్తున్నాడట రాజమౌళి. తండ్రి హరికృష్ణ మరణించి ఇంకా ఏడాది కూడా పూర్తికాకపోవడంతో ఈ ఏడాది పుట్టిన రోజు వేడుకలకు జూనియర్‌ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.

ఎటువంటి హడావుడి చెయ్యొద్దు అంటూ అభిమానులను కూడా కోరాడు. దీంతో ఎన్టీఆర్‌ పుట్టిన రోజున ఓ వినూత్నమైన బహుమతి ఇచ్చి ఆయనను సంతోషపెట్టాలని రాజమౌళి చూస్తున్నాడట. ‘ఆర్.ఆర్.ఆర్’ లో ఎన్టీఆర్ … కొమరం భీమ్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రకు సంబంధించిన ప్రీలుక్‌ను మే 20న విడుదల చేసి తారక్‌ను ఆశ్చర్యపరచాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. మరి ఈ వార్తలో ఎంత వరకూ నిజమనేది తెలియాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus