సాధారణంగా పండుగ సమయంలో విడుదలైతే పెద్ద సినిమాలు అయినా, చిన్న సినిమాలు అయినా పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలకు భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తాయి. ఈ ఏడాది దసరాకు విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పెళ్లిసందడి సినిమాలు పాజిటివ్ టాక్ తో భారీగా కలెక్షన్లను సాధించాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ మూడు సినిమాలలో రెండు సినిమాలు విడుదలైతే థియేటర్ల విషయంలో ఇబ్బందులు ఎదురు కావు.
అలా జరగని పక్షంలో ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమా దారుణంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. మూడు సినిమాలు భారీ సినిమాలు కాగా ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలు పాన్ ఇండియా సినిమాలు కావడంతో ఈ సినిమాల రిలీజ్ డేట్లను మార్చే పరిస్థితి లేదు. ఆర్ఆర్ఆర్ మేకర్స్ ఇప్పటికే భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ మార్చడానికి పలు ప్రయత్నాలు చేశారు. దర్శకుడు రాజమౌళి పవన్ కళ్యాణ్ ను కలిసి రిలీజ్ డేట్ ను మార్చాలని కోరాలని ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు.
ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య చివరి ప్రయత్నంగా రాధేశ్యామ్ నిర్మాతలతో పాటు త్రివిక్రమ్ ను కలిశారని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ విడుదలకు మూడు వారాల సమయం మాత్రమే ఉండటంతో దానయ్య, యూవీ వంశీ త్రివిక్రమ్ ను భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ మార్చాలని కోరారు. త్రివిక్రమ్ మాత్రం భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ తన చేతిలో లేదని అయితే భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ మార్చడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారని బోగట్టా.
పవన్ కళ్యాణ్ సన్నిహితులలో ఒకరైన త్రివిక్రమ్ భీమ్లా రిలీజ్ డేట్ విషయంలో పవన్ ను ఒప్పిస్తారో లేదో చూడాల్సి ఉంది. భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ మారితే ఆ ప్రభావం ఎఫ్3, సర్కారు వారి పాట సినిమాలపై కూడా పడే అవకాశం ఉంది. సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజైతే మూడు సినిమాల ప్రొడ్యూసర్లు నష్టపోయే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో భీమ్లా నాయక్ మేకర్స్, పవన్ ఏం చేస్తారో చూడాల్సి ఉంది.
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!