‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం 19 వ రోజున కూడా పర్వాలేదు అనిపించే విధంగా కలెక్షన్లను రాబట్టింది.టికెట్ రేట్లు తగ్గినప్పటికీ మాస్ సెంటర్స్ లో ఇంకా సత్తా చాటుతూనే ఉంది. లాంగ్ రన్ పడే అవకాశాలు ఈ మూవీకి ఉన్నాయి కాకపోతే ఈరోజు నుండీ విజయ్ ‘బీస్ట్’ మూవీ విడుదల కాబోతుంది.రేపటి నుండీ ‘కె.జి.ఎఫ్2’ వస్తుంది.కాబట్టి ‘ఆర్.ఆర్.ఆర్’ కి చాలా వరకు థియేటర్లు తగ్గడం కలెక్షన్లకి బ్రేకులు పడటం జరుగుతుంది.తెలుగు రాష్ట్రాల్లో ‘బాహుబలి2’ కలెక్షన్లను అధిగమించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘ఆర్.ఆర్.ఆర్’…
మిగిలిన వెర్షన్ల విషయంలో ‘బాహుబలి'(సిరీస్) కలెక్షన్లను అధిగమించే అవకాశాలు కనిపించడం లేదు కానీ ప్రస్తుతానికి ప్రతిష్టాత్మక రూ.1000 కోట్ల గ్రాస్ మార్క్ ను అయితే దాటేసింది.
ఒకసారి ‘ఆర్.ఆర్.ఆర్’ 19 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 108.23 cr |
సీడెడ్ | 48.84 cr |
ఉత్తరాంధ్ర | 31.76 cr |
ఈస్ట్ | 15.59 cr |
వెస్ట్ | 12.48 cr |
గుంటూరు | 17.56 cr |
కృష్ణా | 14.06 cr |
నెల్లూరు | 08.94 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 257.46 cr |
తమిళనాడు | 36.94 cr |
కేరళ | 10.27 cr |
కర్ణాటక | 41.95 cr |
హిందీ | 117.59 cr |
ఓవర్సీస్ | 95.55 cr |
రెస్ట్ | 9.56 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 569.32 cr (అన్ని వెర్షన్లు కలుపుకుని) |
‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం 19 రోజులు పూర్తయ్యేసరికి రూ.569.32 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది.గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.1037 కోట్లను కొల్లగొట్టింది. తెలుగు వెర్షన్ పరంగా ఈ మూవీ ఇండస్ట్రీ హిట్. మిగిలిన వెర్షన్ లలో బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది..
లాభాలు తెచ్చిపెడుతుంది. కానీ రికార్డులు క్రియేట్ చేయడం కష్టమనే చెప్పాలి. ‘బాహుబలి2’ ఓవరాల్ కలెక్షన్లను ‘ఆర్.ఆర్.ఆర్’ అధిగమించడం కష్టంగానే కనిపిస్తుంది. ‘బాహుబలి2’ ఫుల్ రన్లో రూ.814 కోట్ల పైనే షేర్ ను రాబట్టి.. రూ.1783 కోట్ల వరకు గ్రాస్ ను కొల్లగొట్టింది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!