RRR Collections: 24వ రోజున కూడా కోటి పైనే రాబట్టిన ‘ఆర్.ఆర్.ఆర్’ ..!

  • April 18, 2022 / 02:31 PM IST

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం మరో వీకెండ్ ను సక్సెస్ ఫుల్ గా క్యాష్ చేసుకుంది. కొత్త సినిమాల ఎంట్రీ ఇచ్చినా బాక్సాఫీస్ వద్ద జోరు తగ్గడం లేదు. ‘బీస్ట్’ మూవీ ప్లాప్ అవ్వడం వల్ల ‘ఆర్.ఆర్.ఆర్’ కు నిన్న స్క్రీన్లు పెరిగాయి. ‘ఆర్.ఆర్.ఆర్’ చూడాలి అనుకున్న వాళ్ళు, కె.జి.ఎఫ్2 కి టికెట్లు దొరకని వాళ్ళు ఈ మూవీకే ఓటేశారు.దాంతో ఈ వీకెండ్ కూడా ‘ఆర్.ఆర్.ఆర్’ కి హెల్ప్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ ‘బాహుబలి 2’ కలెక్షన్లను అధిగమించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘ఆర్.ఆర్.ఆర్’…

Click Here To Watch NOW

మిగిలిన వెర్షన్ల విషయంలో ‘బాహుబలి'(సిరీస్) కలెక్షన్లను అధిగమించే అవకాశాలు కనిపించడం లేదు. కానీ బాగానే రాణిస్తుంది.

ఒకసారి ‘ఆర్.ఆర్.ఆర్’ 24 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 109.87 cr
సీడెడ్ 49.61 cr
ఉత్తరాంధ్ర 32.28 cr
ఈస్ట్ 15.91 cr
వెస్ట్ 12.68 cr
గుంటూరు 17.79 cr
కృష్ణా 14.28 cr
నెల్లూరు 09.10 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 261.52 cr
తమిళనాడు 37.39 cr
కేరళ 10.38 cr
కర్ణాటక 42.65 cr
హిందీ 124,60 cr
ఓవర్సీస్ 98.00 cr
రెస్ట్ 9.86 cr
టోటల్ వరల్డ్ వైడ్ 584.40 cr (అన్ని వెర్షన్లు కలుపుకుని)

 

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం 24 రోజులు పూర్తయ్యేసరికి రూ.584.4 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది.గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.1080 కోట్లను కొల్లగొట్టింది. తెలుగు వెర్షన్ పరంగా ఈ మూవీ ఇండస్ట్రీ హిట్. మిగిలిన వెర్షన్ లలో బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది.. లాభాలు తెచ్చిపెడుతుంది.

కానీ రికార్డులు క్రియేట్ చేయడం కష్టమనే చెప్పాలి. ‘బాహుబలి2’ ఓవరాల్ కలెక్షన్లను ‘ఆర్.ఆర్.ఆర్’ అధిగమించడం కష్టంగానే కనిపిస్తుంది. ‘బాహుబలి 2’ ఫుల్ రన్లో రూ.814 కోట్ల పైనే షేర్ ను రాబట్టి.. రూ.1783 కోట్ల వరకు గ్రాస్ ను కొల్లగొట్టింది.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus