4ఏళ్లుగా ప్రేక్షకులు ఎన్నో అసలు పెట్టుకుని ఎదురుచూసిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం మార్చి 25న రిలీజ్ అయ్యింది. సినిమాకి కొంత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఎన్టీఆర్- చరణ్- రాజమౌళి కి ఉన్న క్రేజ్ ను బట్టి ఈ సినిమాని చూడడానికి ఎగబడి థియేటర్లకు వస్తున్నారు ప్రేక్షకులు. రాజమౌళి సినిమాలకి టాక్ తో సంబంధం ఉండదు అని ‘ఆర్.ఆర్.ఆర్’ మరోసారి నిరూపించింది. బాహుబలిని మించి అని రాజమౌళి మొదటి నుండీ ఈ మూవీని ప్రమోట్ చేయడంతో మొదటి రోజు ఓపెనింగ్స్ కూడా అన్ని చోట్ల ‘బాహుబలి2’ ని మించి నమోదయ్యాయి.
రెండో రోజు కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు నమోదు చేసింది ‘ఆర్.ఆర్.ఆర్’.3వ రోజున కూడా రెండో రోజు మించి కలెక్ట్ చేసింది.
ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను గమనిస్తే :
నైజాం | 53.45 cr |
సీడెడ్ | 28.90 cr |
ఉత్తరాంధ్ర | 15.50 cr |
ఈస్ట్ | 08.65 cr |
వెస్ట్ | 07.97 cr |
గుంటూరు | 11.47 cr |
కృష్ణా | 08.00 cr |
నెల్లూరు | 04.81 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 138.75 cr |
తమిళ్ నాడు | 16.17 cr |
కేరళ | 05.07 cr |
కర్ణాటక | 18.47 cr |
నార్త్ ఇండియా (హిందీ) | 36.50 cr |
ఓవర్సీస్ | 56.20 cr |
రెస్ట్ | 04.65 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 275.81 cr |
‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.మొదటి వీకెండ్ ఈ చిత్రం రూ.275.81 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది.గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.485 కోట్లను కొల్లగొట్టింది.మొదటి రోజు హిందీలో ఈ సినిమా పెర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ రెండో రోజు నుండీ పుంజుకుంది.
మూడో రోజున కూడా ఈ మూవీ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. లాంగ్ రన్ పడే ఛాన్స్ ఉంది కాబట్టి.. అక్కడ ఈ మూవీ సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈరోజు నుండీ ఈ మూవీకి అసలు పరీక్ష మొదలుకానుంది. వీక్ డేస్ లో తెలుగు రాష్ట్రాల్లో పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?