RRR Collections: ‘ఆర్.ఆర్.ఆర్’ … ఆ ఒక్క రికార్డు కి చేరువలో ఉంది..!

Advertisement

‘ఆర్.ఆర్.ఆర్’ లాంగ్ రన్ ను బాగానే కొనసాగిస్తుంది.ఇప్పటికే విజయవంతంగా 5 వారాలు పూర్తి చేసుకుంది.ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో, నార్త్ లో, ఓవర్సీస్ లో, కర్ణాటక లో ఈ మూవీ ఇంకా కలెక్ట్ చేస్తూనే ఉంది. కొత్త సినిమాల ఎంట్రీ ఇచ్చినా బాక్సాఫీస్ వద్ద ‘ఆర్.ఆర్.ఆర్’ ఇలా పెర్ఫార్మ్ చేస్తుండడం ట్రేడ్ ను సైతం ఆశ్చర్యం కలిగించే విషయం. మరో పక్క ‘కె.జి.ఎఫ్ 2’ కూడా స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తున్నా ‘ఆర్.ఆర్.ఆర్’ పై ఎఫెక్ట్ పడలేదు.

Click Here To Watch NOW

తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ ‘బాహుబలి 2’ కలెక్షన్లను అధిగమించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘ఆర్.ఆర్.ఆర్’… మిగిలిన వెర్షన్ల విషయంలో ‘బాహుబలి'(సిరీస్) కలెక్షన్లను అధిగమించే అవకాశాలు కనిపించడం లేదు. కానీ ఫర్వాలేదనిపిస్తుంది.

ఒకసారి ‘ఆర్.ఆర్.ఆర్’ 35 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 110.99 cr
సీడెడ్ 50.17 cr
ఉత్తరాంధ్ర 32.71 cr
ఈస్ట్ 16.15 cr
వెస్ట్ 13.08 cr
గుంటూరు 18 cr
కృష్ణా 14.49 cr
నెల్లూరు 09.27 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 264.86 cr
తమిళనాడు 37.81 cr
కేరళ 10.55 cr
కర్ణాటక 43.59 cr
హిందీ 131.45 cr
ఓవర్సీస్ 101.50 cr
రెస్ట్ 10.00 cr
టోటల్ వరల్డ్ వైడ్ 599.76 cr (అన్ని వెర్షన్లు కలుపుకుని)

 

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం 35 రోజులు పూర్తయ్యేసరికి రూ.599.76 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది.గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.1114 కోట్లు కొల్లగొట్టింది. తెలుగు వెర్షన్ పరంగా ఈ మూవీ ఇండస్ట్రీ హిట్. మిగిలిన వెర్షన్ లలో బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది.. లాభాలు తెచ్చిపెడుతుంది.

కానీ రికార్డులు వంటివి క్రియేట్ చేయలేదు. ‘బాహుబలి2’ ఓవరాల్ కలెక్షన్లను ‘ఆర్.ఆర్.ఆర్’ అధిగమించడం కష్టమని చాలా వరకు తేలిపోయింది. ‘బాహుబలి 2’ ఫుల్ రన్లో రూ.814 కోట్ల పైనే షేర్ ను రాబట్టి.. రూ.1783 కోట్ల వరకు గ్రాస్ ను కొల్లగొట్టింది. అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం త్వరలో చైనాలో కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో అక్కడ కనుక హిట్ అయితే మరింతగా కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news