టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తున్న సంగతి తెలిసిందే. వేర్వేరు కారణాల వల్ల ఫస్ట్ వీకెండ్ లో టికెట్లు దొరకని వాళ్లు రేపటినుంచి థియేటర్లలో ఈ సినిమాను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీతో చరణ్, తారక్ లకు పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు దక్కింది. బాలీవుడ్ లో కూడా ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. హిందీలో ఈ సినిమాకు పాజిటివ్ గా రివ్యూలు రావడంతో బాలీవుడ్ ప్రేక్షకులు థియేటర్లలో ఈ సినిమా చూడటానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు.
హిందీలో శుక్రవారం కలెక్షన్లతో పోల్చి చూస్తే శనివారం కలెక్షన్లు మెరుగ్గా ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ హిందీలో సక్సెస్ సాధించడంతో చరణ్, తారక్ బాలీవుడ్ కోరిక తీరినట్టేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తారక్, చరణ్ తర్వాత సినిమాలకు హిందీలో ఏ స్థాయిలో బిజినెస్ జరుగుతుందో చూడాల్సి ఉంది. చరణ్ కు ఆర్ఆర్ఆర్ ఏ స్థాయిలో ప్లస్ అయిందో ఆచార్య మూవీతో తేలిపోనుంది. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కావడానికి మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది.
ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో చరణ్ సంతోషంగా ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ లో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ అద్భుతంగా జీవించాడని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చరణ్, తారక్ లకు ఆర్ఆర్ఆర్ కెరీర్ పరంగా ప్లస్ అవుతుందనడంలో సందేహం అవసరం లేదు. రాజమౌళి తన సినిమాల ద్వారా టాలీవుడ్ స్టార్స్ కు పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపును తెచ్చిపెడుతున్నారు. మహేష్ తో జక్కన్న తన తర్వాత సినిమాను తెరకెక్కించనున్నారు.
ఈ సినిమాను కూడా భారీగానే జక్కన్న తెరకెక్కించనున్నారు. 600 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. దసరా నుంచి మహేష్ జక్కన్న కాంబో మూవీ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?