RRR Censor Cut Details: ఆర్ఆర్ఆర్ మూవీ రన్ టైమ్ ను తగ్గించేశారా?

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి మరో ఆరు రోజుల సమయం మాత్రమే ఉంది. ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లను పెంచడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ మూవీ కలెక్షన్లు కొత్త రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏపీలో కనీసం 100 రూపాయల నుంచి గరిష్టంగా 320 రూపాయల వరకు ఆర్ఆర్ఆర్ టికెట్ రేట్లు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఆర్ఆర్ఆర్ మూవీ రన్ టైమ్ 3 గంటల 6 నిమిషాల 54 సెకన్లు అని జోరుగా ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే.

Click Here To Watch Now

అయితే ఆర్ఆర్ఆర్ మేకర్స్ నిడివి మరీ ఎక్కువైన నేపథ్యంలో 5 నిమిషాల ఒక సెకన్ నిడివి గల సీన్లను తగ్గించేశారని సమాచారం. సినిమాలో 20 సెకన్ల థ్యాంక్స్ కార్డ్ కు సంబంధించిన సీన్లను, ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో చెప్పే అది భారతదేశపు అనే డైలాగ్స్ ను, విజువల్స్ ను, సినిమా ఎండ్ టైటిల్స్ ను తొలగించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ నిడివి మూడు గంటల ఒక నిమిషం 53 సెకన్లుగా ఉంది.

మరోవైపు ఈ సినిమాలో అభ్యంతరంగా ఉన్న కొన్ని డైలాగ్స్ ను సెన్సార్ సభ్యులు మ్యూట్ చేశారని తెలుస్తోంది. కొన్ని సన్నివేశాల్లో ఫ**గ్ అనే డైలాగ్ వచ్చినప్పుడు మ్యూట్ చేయడంతో పాటు సబ్ టైటిల్ ను కూడా తొలగించారు. మరికొన్ని సన్నివేశాల్లో అభ్యంతరకరంగా ఉండటంతో “ఇండియన్” అనే వర్డ్ ను మ్యూట్ చేయడం తో పాటు సబ్ టైటిల్ ను కూడా తీసేశారు. కొన్ని సన్నివేశాల్లో బి* అనే డైలాగ్ ను కూడా సెన్సార్ సభ్యులు మ్యూట్ చేశారని తెలుస్తోంది.

ఎక్కువ సెన్సార్ కట్స్ లేకుండానే ఈ సినిమా సెన్సార్ ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉండేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ రిలీజైన తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుందని ఫ్యాన్స్ బలంగా విశ్వసిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తొలిరోజు కలెక్షన్లు అంచనాలకు మించి ఉండబోతున్నాయని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

1

2

3

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus