RRR Collections: ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ సునామీ.. అప్పుడే అన్ని కోట్లా!

దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకువచ్చిన బిగ్గెస్ట్ మల్టిస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ అనుకున్నట్లే సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పటికే బాహుబలి కంటే హై రేంజ్ లో ఓపెనింగ్స్ అందుకున్న ఈ సినిమా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతోంది. బాక్సాఫీస్ వద్ద రోజురోజుకు కలెక్షన్ల సంఖ్య అయితే గట్టిగానే పెరుగుతోంది. ప్రతిరోజు సినిమాకు సంబంధించిన ఏదో ఒక రికార్డు సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారుతోంది.

Click Here To Watch NOW

ఇక ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లో ఒక అరుదైన రికార్డును నమోదు చేసింది. ఇప్పటివరకు ఏ సినిమా కూడా బ్రేక్ చేయలేని ఒక రికార్డు ను ఆర్ఆర్ఆర్ సినిమా తన ఖాతాలో వేసుకుంది. మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా 500కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ దెబ్బతో రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అంతేకాకుండా మరోసారి రాజమౌళి నెంబర్ వన్ దర్శకుడిగా గుర్తింపు అందుకుంటున్నాడు.

బాలీవుడ్ ప్రముఖులు కూడా ఆర్ఆర్ఆర్ సృష్టిస్తున్న కలెక్షన్స్ సునామీకి షాక్ అవుతున్నారు. మొన్నటి వరకు కూడా నార్త్ లో సినిమా అంతగా అడదేమో అనే కామెంట్స్ వినిపించాయి కానీ ఇప్పుడు మాత్రం అక్కడే కలెక్షన్స్ ఎక్కువగా పెరుగుతూ ఉండడం విశేషం. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా త్వరలోనే 750 కోట్ల వసూళ్లను అందుకుని మరొక రికార్డును క్రియేట్ చేయగలదు అని సినీ ప్రముఖులు అంచనావేస్తున్నారు. ఇక దర్శకుడు రాజమౌళి ఇద్దరు స్టార్ హీరోలతో చేసిన అతి పెద్ద ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది అందరిలో ఒక అనుమానాన్ని కలిగించింది.

కానీ రాజమౌళి బ్రాండ్ కారణంగా సినిమాకు మంచి ప్రమోషన్ చేయడం కూడా ఉపయోగపడింది. అందుకే సినిమా చాలా వేగంగా 500 కోట్ల కలెక్షన్ అందుకని ఆశ్చర్యాన్ని కలిగించింది. మరి 750 కోట్ల వసూళ్లను ఇంకా ఎంత వేగంగా అందుకుంటుందో చూడాలి. ఇప్పట్లో అయితే సినిమా వసూళ్లు తగ్గే అవకాశం లేదని తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus