RRR Movie: ఆర్ఆర్ఆర్ అడ్వాన్స్ బుకింగ్స్.. న్యూ రికార్డ్

జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తేజ్ ఫస్ట్ టైమ్ కలిసి నటించిన బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ యాక్షన్ మూవీ మార్చ్ 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. సినిమా కోసం మెగా నందమూరి అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇటీవల సినిమాకు సంబంధించిన మరొక సెలబ్రేషన్స్ పాట కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

Click Here To Watch Now

రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేస్తూ అభికనులకు మంచి బూస్ట్ ఇచ్చారు. ఇక అలియా భట్ ఆ పాటలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మొత్తానికి అన్ని విషయాల్లోనూ సినిమా ప్రేక్షకుల్లో అమితమైన ఆసక్తిని కలిగిస్తోంది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సరికొత్త రికార్డులను క్రియేట్ చేసేలా ఉందని అనిపిస్తోంది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా మంచి బిజినెస్ చేసిన విషయం తెలిసిందే.

అయితే యూఎస్ లో ఈసారి ఈ సినిమాతో సరికొత్త రికార్డులు నమోదు కాబోతున్నట్లు అర్థమవుతోంది. అసలైతే గత జనవరిలో సినిమాను విడుదల చేయాలని అనుకున్నప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ తో సినిమా వన్ మిలియన్ డాలర్లను దాటింది. ఇక ఇప్పుడు సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులు భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం విశేషం. ఇంకా సినిమాకు పది రోజుల సమయం ఉంది. ఇక ఇప్పుడే 1.5 మిలియన్ల డాలర్ల వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్ తోనే అందుకోవడం న్యూ రికార్డ్.

చూస్తుంటే ఆర్ఆర్ఆర్ సినిమా పెట్టిన పెట్టుబడికి భారీ స్థాయిలో లాభాలు అందిస్తుందని అనిపిస్తుంది. ఇక సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు రాజమౌళి రోజురోజుకు ప్రమోషన్స్ డోస్ పెంచుతున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus