RRR Collections: ఆర్ఆర్ఆర్ ఆ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందా?

భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి ఆరు రోజుల సమయం మాత్రమే ఉంది. హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్లతో కలిపి 478 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ కు 890 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందని బోగట్టా. బాహుబలి-2 కలెక్షన్లు ఆర్ఆర్ఆర్ తో కచ్చితంగా బ్రేక్ అవుతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రిలీజ్ కు ముందు ఆర్ఆర్ఆర్ నిర్మాతకు లాభం 400 కోట్ల రూపాయలుగా ఉంది.

Click Here To Watch Now

సినిమా రిలీజైన తర్వాత కూడా ఈ సినిమాకు భారీస్థాయిలో లాభాలు రావడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీకి వచ్చిన లాభాల్లో నిర్మాతకు 50 శాతం, దర్శకునికి 50 శాతం వాటా ఉండనుందని తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమా తొలిరోజు 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధిస్తుందని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెరగడంతో పాటు ఐదు షోలకు అనుమతులు లభించడంతో ఈ సినిమా కలెక్షన్లు కళ్లు చెదిరే స్థాయిలో ఉండే అవకాశం అయితే ఉంది.

అయితే హిందీలో, ఇతర రాష్ట్రాల్లో సాధించే కలెక్షన్లను బట్టి ఈ సినిమా రేంజ్ డిసైడ్ అవుతుందని చెప్పవచ్చు. నైజాంలో రేపటినుంచి ఈ సినిమాకు ఆన్ లైన్ బుకింగ్స్ మొదలుకావచ్చని ప్రచారం జరుగుతుండటం గమనార్హం. జక్కన్న ఈ సినిమా రిజల్ట్ విషయంలో ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. రాజమౌళి సినిమా అంటే సాధారణంగా ప్రేక్షకులకు బోర్ కొట్టదు. మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమాకు టికెట్లు దొరకడం తేలిక కాదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. రిలీజైన తర్వాత బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.

జక్కన్న ఇప్పటివరకు ప్రేక్షకులను ఎప్పుడూ నిరుత్సాహపరచలేదు. ఆర్ఆర్ఆర్ కు యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుందనడంలో సందేహం అవసరం లేదు. ఈ సినిమా ఫుల్ రన్ లో 3000 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తుందని అంచనాలు ఉండగా ఆ స్థాయిలో కలెక్షన్లు వస్తాయో లేదో చూడాల్సి ఉంది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus