RRR Review: ఆర్ఆర్ఆర్ సినిమా ఫస్ట్ రివ్యూ & రేటింగ్ వచ్చేసింది..!

ఎన్టీఆర్- చరణ్ లు హీరోలుగా ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ మరియు పాన్ వరల్డ్ మూవీ ‘ఆర్.ఆర్.ఆర్’. డి.వి.వి.దానయ్య నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీలో బాలీవుడ్ స్టార్లు ఆలియా భట్, అజయ్ దేవగన్ వంటి వారు నటిస్తున్నారు. తమిళ నటుడు సముద్రఖని కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ మార్చి 25న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇప్పటికే బెనిఫిట్ షోల సందడి మరియు అడ్వాన్స్ బుకింగ్స్ సందడి మొదలైపోయింది.

Click Here To Watch NEW Trailer

సోమవారం వరకు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల టికెట్లు బుక్ అయిపోయాయి. ఇంకా బుక్ మై షోలో థియేటర్లు యాడ్ అవుతున్నప్పటికీ టికెట్లు హాట్ కేకుల్లా సేల్ అయిపోతున్నాయి. ఇక ఈ చిత్రం ఫస్ట్ రివ్యూ కూడా బయటకి వచ్చిన నేపథ్యంలో అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది. ప్రముఖ సెన్సార్ సభ్యుడు విశ్లేషకుడు ఉమర్ సంధు ఈ చిత్రాన్ని వీక్షించి తన అభిప్రాయాన్ని ట్విట్టర్లో వెల్లడించాడు.

‘ఆర్.ఆర్.ఆర్’ కు ఎన్టీఆర్ సోల్ అని చెప్పుకొచ్చాడు. అతను చాలా అత్యద్భుతంగా చేసాడని తెలిపాడు. రాంచరణ్ భీభత్సమైన ఫామ్లో ఉన్నాడని. ఎన్టీఆర్- చరణ్ కలయిక గురించి తరతరాలు చెప్పుకుంటారని.. రాజమౌళి ఆ స్థాయిలో వీళ్ళని ప్రెజెంట్ చేసాడని చెప్పుకొచ్చాడు.

ప్రతీ ఒక్క భారతీయుడు గర్వపడేలా ఈ మూవీ ఉంటుందని.. ఒక పెద్ద కలగని దానిని సాధించిన ఇండియన్ ఫిలింమేకర్ (దర్శకుడు రాజమౌళి) మనకు ఉండడం మనకి గర్వకారణమని. ‘ఆర్.ఆర్.ఆర్’ అందరూ మిస్ అవ్వకుండా చూడాల్సిన చిత్రమని, ప్రస్తుతానికి ఇది బ్లాక్ బస్టర్ అని చెప్పుకున్నా తర్వాత ఇది ఒక క్లాసిక్ గా పిలవబడుతుందని, ఎన్టీఆర్- చరణ్ లు నట విశ్వరూపాలు చూస్తామని ఉమర్ సందు చెప్పుకొచ్చాడు.

‘ఆర్.ఆర్.ఆర్’ అనేది మంచి కథాబలం ఉన్న చిత్రమని,యం.యం.కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థ్రిల్ చేస్తుందని, నిర్మాణ విలువలు కూడా అద్భుతంగా ఉన్నాయని, బిగినింగ్ దగ్గర నుండీ ఎండింగ్ వరకు ఎంగేజింగ్ గామూవీ సాగిందని, ఆకట్టుకునే నటీనటుల పెర్ఫార్మన్స్ లతో సినిమా అద్భుతంగా ఉందని. స్టోరీ- స్క్రీన్ ప్లే అనేవి సినిమాకి రియల్ హీరోలు అని చెప్పుకొచ్చాడు ఉమర్.

3 గంటల నిడివి ఉన్నప్పటికీ.. ఎక్కువ లెంగ్త్ ఉన్నట్టు అనిపించలేదని చెప్పి ‘ఆర్.ఆర్.ఆర్’ కి 5/5 రేటింగ్ ఇచ్చేసాడు ఉమర్.

ఇక సినిమాలో అయితే అజయ్ దేవగన్ కు హీరోలకి మధ్య కాంబినేషనల్ సీన్స్ అనేవి ఉండవని,ఇంటర్వెల్ వద్ద అల్లూరి- భీమ్ ల మధ్య(చరణ్- ఎన్టీఆర్) భారీ ఫైట్ ఉంటుందని.. ఇది చాలా ఎమోషనల్ గా సాగుతుందని, క్లైమాక్స్ లో ట్రాజెడీ టచ్ ఉందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.మరి ఇవి ఎంతవరకు నిజమో సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి..!

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus