ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రకు తారక్ కొమురం భీమ్ పాత్రకు ప్రాణం పోశారు. మార్చి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ వీక్ డేస్ లో కూడా కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం కొనసాగిస్తుండటం గమనార్హం. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ చరణ్, తారక్ లలో ఎవరికి ఎంత ప్లస్ అవుతుందో ఇప్పుడే చెప్పలేము.
కొన్నేళ్ల క్రితం జంజీర్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకున్న రామ్ చరణ్ కు ఆ సినిమాతో చేదు ఫలితం ఎదురైంది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ చరణ్ కు బాలీవుడ్ లో కలిసొచ్చింది. క్లైమాక్స్ లో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించగా బాలీవుడ్ ఆడియన్స్ చరణ్ రాముడి పాత్రలో కనిపించాడని భావిస్తుండటం గమనార్హం. మరోవైపు బాలీవుడ్ ప్రేక్షకులు జూనియర్ ఎన్టీఆర్ నటనకు ఫిదా అయ్యారు. బాలీవుడ్ క్రిటిక్స్ తమ రివ్యూలలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
అయితే చరణ్, తారక్ తర్వాత సినిమాలు బాలీవుడ్ లో, ఇతర ఇండస్ట్రీలలో ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తాయో ఆ కలెక్షన్లను బట్టి మాత్రమే ఈ హీరోల మార్కెట్ డిసైడ్ అవుతుందని చెప్పవచ్చు. తారక్, చరణ్ తమ భవిష్యత్తు ప్రాజెక్టులతో కూడా బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీలో హీరోల పాత్రలకు జక్కన్న ఎలివేషన్స్ బాగానే ఇచ్చినా బాహుబలి2 స్థాయిలో అయితే ఎలివేషన్స్ ఇవ్వలేదు. చరణ్ తర్వాత ప్రాజెక్ట్ ఆచార్య వచ్చే నెలలో రిలీజ్ కానుండగా ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు అనే సంగతి తెలిసిందే.
తారక్ తర్వాత సినిమాకు కూడా కొరటాల శివ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. చరణ్, తారక్ పాన్ ఇండియా ఇమేజ్ ను కొరటాల శివ మరింత పెంచుతారేమో చూడాల్సి ఉంది. చరణ్, తారక్ పాన్ ఇండియా కల ఆర్ఆర్ఆర్ తో నెరవేరినట్టేనని చెప్పవచ్చు.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?