Alia Bhatt: ఆ ప్రచారం వల్ల అలియా భట్ కు నష్టమేనా?

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో పాపులారిటీ ఉన్న హీరోయిన్లలో అలియా భట్ ఒకరనే సంగతి తెలిసిందే. అలియా భట్ హీరోయిన్ గా నటిస్తే ఆ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. ఇతర హీరోయిన్లతో పోల్చి చూస్తే అలియా భట్ రెమ్యునరేషన్ కూడా ఎక్కువ మొత్తమనే సంగతి తెలిసిందే. సాధారణంగా టాలీవుడ్ హీరోయిన్లు సినిమా ప్రమోషన్ల కోసం అదనంగా డబ్బులు వసూలు చేయరు. అయితే ఈ విషయంలో బాలీవుడ్ హీరోయిన్లు మాత్రం భిన్నమనే సంగతి తెలిసిందే.

Click Here To Watch Now

ఆర్ఆర్ఆర్ కోసం అరగంట కంటే తక్కువ నిడివి ఉన్న పాత్ర కొరకు 9 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకున్న అలియా భట్ గతంలో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో పాల్గొన్నందుకు రెమ్యునరేషన్ కు ఆదనంగా కోట్ల రూపాయలు తీసుకున్నారని సమాచారం అందుతోంది. ఆ కారణం వల్లే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కు మేకర్స్ ఆమెను పిలవలేదని తెలుస్తోంది. అయితే మరోవైపు ఈ నెల 15వ తేదీన అలియా భట్ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.

నిన్న అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఆమె కొత్త సినిమాలకు సంబంధించిన అప్ డేట్లు వచ్చాయి. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి మాత్రం అలియా భట్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్ రిలీజ్ కాలేదు. అలియా భట్ ప్రమోషన్స్ కోసం భారీగా డిమాండ్ చేయడం వల్లే ఆర్ఆర్ఆర్ మేకర్స్ ఇలా చేశారని తెలుస్తోంది. అయితే చరణ్ మాత్రం సోషల్ మీడియా వేదికగా అలియా భట్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం.

అలియా భట్ ప్రమోషన్స్ కోసం ఈ విధంగా వ్యవహరిస్తే ఆమె కెరీర్ పై ప్రభావం పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రమోషన్స్ కోసం కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తే టాలీవుడ్ నిర్మాతలు అలియా భట్ కు ఆఫర్లు ఇవ్వడం కష్టమేనని చెప్పవచ్చు. వైరల్ అవుతున్న వార్తలపై అలియా భట్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus