RRR Movie: ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం షాకింగ్ బడ్జెట్!

మెగా నందమూరి కాంబినేషన్ లో వస్తున్నా బిగ్గెస్ట్ బాక్సాఫీస్ మల్టీస్టారర్ మూవీ త్రిబుల్ ఆర్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ఇదివరకే క్లారిటీ వచ్చేసింది. దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే రెగ్యులర్ ప్రమోషన్ కూడా స్టార్ట్ చేశారు. సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ

నెల రోజుల ముందు నుంచే ఈ చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా హడావుడిగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్నారు.ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా ప్రమోషన్ విషయంలో తెగ్గేదేలే అనేలా అడుగులు వేస్తున్నారు. ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. దుబాయ్ లో ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించాలని ముందు నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. నిర్మాత డి.వి.వి.దానయ్య తోపాటు రాజమౌళి తనయుడు కార్తికేయ ఈవెంట్ కార్యక్రమాలను దగ్గరుండి అన్ని రకాల ఏర్పాట్లను సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

అయితే అయితే ఈ ఈవెంట్ కోసం నిర్మాత డి.వి.వి.దానయ్య గతంలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు 9 కోట్ల బడ్జెట్ తో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సినిమా హీరోల ఎంట్రీ తో పాటు ప్రత్యేకంగా కొన్ని స్పెషల్ డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో పాన్ ఇండియా సినిమాగా విడుదల అవుతోంది కాబట్టి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఈ వేడుకను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

దర్శకధీరుడు రాజమౌళి కుటుంబంతో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాను జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమా అత్యధిక స్క్రీన్లలో విడుదల చేయబోతున్నారు. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుందో చూడాలి.

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

Most Recommended Video

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus