RRR Movie: ట్విటర్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌… భలే మజాగుందనుకో!

కాదేదీ కవితకు అనర్హం అన్నారు ఓ పెద్దమనిషి ఆనాడు. కాదేదీ ప్రచారానికి అనర్హం అన్నాడు మన సినిమా వాళ్లు ఇప్పుడు. సోషల్‌ మీడియాను ఎంత బాగా హ్యాండిల్‌ చేస్తే… సినిమా అంతగా ఫ్యాన్స్‌, నెటిజన్ల నోళ్లలో నానుతుంది అని చెప్పొచ్చు. దీన్ని ఇటీవల కాలంలో మన సినిమావాళ్లు బాగా యూజ్‌ చేసుకుంటున్నారు. అలాంటి ప్రయత్నం ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో ముఖ్యంగా ట్విటర్‌లో జరుగుతోంది. ఆ పని చేస్తోంది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు సంబంధించి చాలా రోజుల నుండి అప్‌డేట్‌ ఏమీ రావడం లేదు. జనవరి 7న సినిమా విడుదల అని సమాచారం వచ్చాక… ఇంకేమీ లేదు. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం రోజూ ఏదో విషయం ట్రెండ్‌ అవుతూనే ఉంది. ఇప్పుడు కూడా సినిమా దీపావళి ట్రైలర్‌ గురించి చర్చ జరుగుతోంది. దీపావళికి ట్రైలర్‌ వస్తుందా? వస్తే ఎలా ఉంటుంది? అంటూ ఓ చర్చ నడుస్తోంది. నిన్న, మొన్న వేరే టాపిక్‌లు నడిచాయి.

ఇదంతా చూస్తుంటే కావాలనే ట్విటర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కాన్సెప్ట్‌ను రన్‌ చేస్తున్నారు అనిపిస్తోంది. ట్రైలర్‌, టీజర్‌, వీడియో, సింగిల్‌ ఇలా ఏదైనా వచ్చినప్పుడు దాని గురించి హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవ్వడం మనం చూశాం. కానీ ఏ సమాచారం లేకుండా సోషల్‌ మీడియాను వాడుకుంటున్నారు అని ఒక్కోసారి అనిపిస్తుంది. అయితే ఇది వాడుకోవడం కాదు, సోషల్‌ మీడియాను ఆడుకోవడం అనే మాటా వినిపిస్తోంది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus