RRR Movie: ఆర్ఆర్ఆర్‌ రేంజ్ ను డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఇదే!

  • March 26, 2022 / 12:21 PM IST

బాహుబలి, బాహుబలి2 సినిమాలతో దర్శకధీరుడు రాజమౌళి టాలీవుడ్ మార్కెట్ ను ఊహించని స్థాయిలో పెంచారు. తెలుగు సినిమాలకు హిందీతో పాటు ఇతర భాషల్లో మార్కెట్ పెరగడానికి జక్కన్న కారణమయ్యారు. రాజమౌళి నిదానంగా సినిమాలను తెరకెక్కిస్తారని విమర్శ ఉన్నా రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమా నిర్మాతలకు భారీ లాభాలను అందించింది. తండ్రి ఇచ్చే కథకు అద్భుతమైన కథనాన్ని జోడించి జక్కన్న విజయాలను అందుకుంటున్నారు. బాహుబలి, బాహుబలి2 రిలీజ్ సమయానికి టాలీవుడ్ పై ఓటీటీ ప్రభావం పెద్దగా లేదనే సంగతి తెలిసిందే.

Click Here To Watch NOW

ప్రస్తుతం టాలీవుడ్ నిర్మాతల ప్రధాన ఆదాయ వనరులలో ఓటీటీ హక్కులు కూడా ఒకటి. బాహుబలి, బాహుబలి2 సినిమాలకు రిపీట్ ఆడియన్స్ రావడం ఆ సినిమాలకు కలిసొచ్చింది. ఆర్ఆర్ఆర్‌ సినిమా కూడా అద్భుతంగా ఉండటంతో చరణ్, తారక్ అభిమానులు మళ్లీమళ్లీ ఈ సినిమాను థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే టికెట్ రేట్లు మరీ ఎక్కువగా ఉండటం వల్ల కొందరు అభిమానులు సినిమాను రెండోసారి థియేటర్లలో చూడటానికి సంకోచిస్తున్నారు.

రెండు నెలల తర్వాత ఆర్ఆర్ఆర్‌ ఓటీటీలో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ఒకసారి చూసిన మరి కొందరు అభిమానులు ఆగిపోతున్నారు. అయితే రిపీట్ ఆడియన్స్ వల్ల ఆర్ఆర్ఆర్‌ సినిమా కలెక్షన్లు భారీస్థాయిలో పెరిగే అవకాశాలు ఉంటాయి. తెలంగాణలో సోమవారం తర్వాత, ఏపీలో ఏప్రిల్ 3వ తేదీ తర్వాత టికెట్ రేట్లు తగ్గనున్న నేపథ్యంలో రిపీట్ ఆడియన్స్ ఈ సినిమాపై దృష్టి పెడతారేమో చూడాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్‌ కు పాజిటివ్ టాక్ రావడంతో హిందీలో, ఇతర భాషల్లో కూడా ఈ సినిమాకు బుకింగ్స్ అంతకంతకూ పెరుగుతున్నాయి.

బాలీవుడ్ క్రిటిక్స్ సైతం ఈ సినిమాను తెగ మెచ్చుకుంటున్నారు. బాలీవుడ్ లో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. రికార్డు స్థాయి స్క్రీన్లలో హిందీలో ఆర్ఆర్ఆర్‌ రిలీజ్ కావడం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus