RRR movie: నేపాల్ లో ఆర్ఆర్ఆర్ కు మాత్రమే ఈ రికార్డు సొంతమా?

రాజమౌళి తన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అంటే ప్రమోషన్స్ ద్వారా ఊహించని స్థాయిలో అంచనాలను పెంచేస్తారనే సంగతి తెలిసిందే. బాహుబలి2 ఇండస్ట్రీ హిట్ తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాకు కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. నేపాల్ లో కూడా ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటోందని సమాచారం అందుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా నేపాల్ లో ఏకంగా ఏడు కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది.

Click Here To Watch NOW

ఆర్ఆర్ఆర్ రిలీజైన రోజు నుంచి రోజుకు కోటి రూపాయల చొప్పున నేపాల్ లో కలెక్షన్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది. నేపాల్ లో ఈ స్థాయిలో కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రం ఆర్ఆర్ఆర్ మాత్రమేనని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మూవీ కలెక్షన్ల విషయంలో కళ్లు చెదిరే రికార్డులను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. చరణ్, తారక్ ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో నేపాల్ లో కూడా సత్తా చాటుతున్నారు. నేపాల్ సినీ విశ్లేషకులు సైతం అక్కడ ఆర్ఆర్ఆర్ సాధిస్తున్న కలెక్షన్లను చూసి అవాక్కవుతున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

నేపాల్ లో సినిమా చూసిన ఆడియన్స్ స్క్రీన్ ముందుకు వెళ్లి విజిల్స్ వేస్తూ డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. బాహుబలి2 ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుందో ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా అదేస్థాయిలో కలెక్షన్లు వస్తుండటం గమనార్హం. ఆస్ట్రేలియాలో, దుబాయ్ లో, ఆఫ్రికన్ దేశాలలో కూడా ఈ సినిమా అంచనాలను మించి కలెక్షన్లను సాధిస్తోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఇంట్రడక్షన్ సీన్లు, క్లైమాక్స్ సీన్, ఇంటర్వెల్ సీన్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

ఎన్టీఆర్, చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీలో పోటాపోటీగా నటించగా ఇద్దరు హీరోల కెరీర్ కు ఈ సినిమా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. ఆర్ఆర్ఆర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో అంచనాలకు అందని స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది. హిందీ వెర్షన్ లో ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్లు 100 కోట్ల మార్కును దాటాయనే సంగతి తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus