RRR movie: ప్రేక్షకులు లేక ఆ థియేటర్ లో మూవీ ఆపేశారా?

రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి స్క్రీన్లలో ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లు సాధిస్తుండగా ఓవర్సీస్, నైజాం ఏరియాలలో ఈ సినిమా కలెక్షన్లు ఊహించని స్థాయిలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు ఇవ్వడం ఈ సినిమాకు కలిసొచ్చింది. వీక్ డేస్ లో కూడా ఆర్ఆర్ఆర్ మూవీని ప్రదర్శిస్తున్న పలు థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

Click Here To Watch NOW

అయితే హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో ఉన్న ఒక థియేటర్ లో ప్రేక్షకులు లేక ఆర్ఆర్ఆర్ షో క్యాన్సిల్ అయిందని సమాచారం అందుతోంది. వైరల్ అవుతున్న ఈ వార్త గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ మూవీ ఫస్ట్ డే టికెట్లు ఊహించని రేటుకు తెలుగు రాష్ట్రాల్లో అమ్ముడయ్యాయనే సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీ బెనిఫిట్ షో టికెట్లను 2500 రూపాయల నుంచి 4000 రూపాయల వరకు ఖర్చు చేసి కొనుగోలు చేశామని కొందరు అభిమానులు మీడియాతో వెల్లడించారు.

ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా ఆర్ఆర్ఆర్ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శితమవుతోంది. అయితే ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో రిలీజ్ కావడంతో వీక్ డేస్ లో కొన్ని థియేటర్లలో అనుకున్న స్థాయిలో ఆక్యుపెన్సీ రావడం లేదు. ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్ రేట్లు మరీ ఎక్కువగా ఉండటం ఈ సినిమాకు ఒకింత మైనస్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ కు తెలుగు రాష్ట్రాల్లో సాధారణ టికెట్ రేట్లు అమలు చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం వల్లే ఈ సినిమాను థియేటర్లలో చూడటాన్ని వాయిదా వేసుకున్న ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీ సెకండ్ వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ ఇప్పటికే దాదాపుగా 350 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించగా మరో 150 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus