Prabhas, RRR: ప్రభాస్ కోసం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ప్లాన్!

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ లో కూడా సినిమాకి మంచి క్రేజ్ ఏర్పడింది. ఓవర్సీస్ ఆడియన్స్ అయితే సినిమాను ఎగబడి చూస్తున్నారు. దీంతో ఒక్క ప్రీమియర్ షోలతోనే మిలియన్ల డాలర్లు కలెక్షన్స్ వచ్చాయి.

Click Here To Watch NOW

ఈ సినిమాను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు నెటిజన్లు. సెలబ్రిటీలు సైతం రాజమౌళి మేకింగ్ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. దర్శకుడు సుకుమార్ అయితే.. ఇలాంటి సినిమాలు మీరు మాత్రమే చేయగలరు.. మేం చూడగలమంతే అంటూ రాజమౌళిని ఆకాశానికెత్తేశారు. మిగిలిన వాళ్లంతా తమ తమ శైలిలో స్పందిస్తూనే ఉన్నారు. అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి ఇలా చాలా మంది సినిమా గురించి గొప్పగా మాట్లాడారు. కానీ ప్రభాస్ మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఇప్పటివరకు మాట్లాడలేదు.

రాజమౌళితో ప్రభాస్ కి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజమౌళి కారణంగానే పాన్ ఇండియా హీరోనయ్యా అంటూ ప్రభాస్ చాలా సార్లు చెప్పారు. ‘రాధేశ్యామ్’ సినిమా ప్రమోషన్స్ లో రాజమౌళి కూడా సాయం చేశారు. సినిమా ఎడిటింగ్ కి సంబంధించిన కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యారని చెబుతుంటారు. అందులో ‘ఆర్ఆర్ఆర్’ గురించి ప్రభాస్ ఏం మాట్లాడతాడా..? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ప్రభాస్ ఇప్పటివరకు సినిమానే చూడలేదట.

అందుకే ప్రభాస్ కోసం ప్రత్యేకంగా స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలని రాజమౌళి టీమ్ భావిస్తోంది. ఈ సోమవారం ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఈ సినిమా ప్రదర్శించబోతున్నారని తెలుస్తోంది. ఈ స్క్రీనింగ్ కి ప్రభాస్ తో పాటు ఎన్టీఆర్, చరణ్ లు కూడా వస్తారని సమాచారం. అయితే ఎప్పుడు..? ఎక్కడ..? అనే విషయాలపై క్లారిటీ రావాల్సివుంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus