RRR Movie Songs: ఆ తప్పు జరగకుండా జక్కన్న జాగ్రత్త పడతారా?

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన రెండు పాటలు సినిమాపై అంచనాలు పెంచినా అన్ని వర్గాల ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆ రెండు పాటలు ఆకట్టుకోలేదు. అయితే మూడో పాటతో సినిమాపై అంచనాలను పూర్తిస్థాయిలో పెంచాలని రాజమౌళి అనుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ మూడో సాంగ్ నవంబర్ 24వ తేదీన రిలీజ్ కానుందని సమాచారం. అయితే ఆర్ఆర్ఆర్ మూడో సాంగ్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

దోస్తీ సాంగ్ రొటీన్ గా ఉందని విమర్శలు వినిపించగా నాటు నాటు సాంగ్ లో డ్యాన్స్ స్టెప్పులు కాపీ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మూడో సాంగ్ విషయంలో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా రాజమౌళి జాగ్రత్త పడతారేమో చూడాల్సి ఉంది. 550 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి వరుసగా అప్ డేట్స్ ఇస్తూ రాజమౌళి సినిమాపై అంచనాలను పెంచుతున్నారు. కీరవాణి ఈ సినిమా పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం ఎంతో కష్టపడ్డారని సమాచారం.

ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ దుబాయ్ లో జరగనుందని తెలుస్తోంది. డీవీవీ దానయ్య ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించారు. ఆర్ఆర్ఆర్ దేశభక్తి కథాంశంతో తెరకెక్కుతున్నా ప్రేక్షకులు మెచ్చే కమర్షియల్ అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది. ఒలీవియా మోరిస్, అలియా భట్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తుండగా శ్రియ, అజయ్ దేవగణ్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus