Rajamouli: ఆ విమర్శలు పట్టించుకోకపోతే రాజమౌళికి నష్టమేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ దర్శకునికి లేని స్థాయిలో రాజమౌళికి అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే. పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా రాజమౌళి కథలు ఉంటాయి. బాహుబలి1, బాహుబలి2 సినిమాలతో జక్కన్న క్రియేట్ చేసిన రికార్డులను ప్రేక్షకులు సులువుగా మరిచిపోలేరు. భాషతో సంబంధం లేకుండా బాహుబలి సిరీస్ తో జక్కన్న సత్తా చాటారు. ఆర్ఆర్ఆర్ మూవీతో మరో ఇండస్ట్రీ హిట్ ను రాజమౌళి ఖాతాలో వేసుకున్నారు.

Click Here To Watch NOW

రాజమౌళి భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తే ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అని ప్రేక్షకులు సైతం భావిస్తారు. మగధీర తర్వాత తక్కువ బడ్జెట్ తోనే సినిమాలను తెరకెక్కించిన రాజమౌళి బాహుబలి2 తర్వాత మాత్రం వరుసగా భారీ బడ్జెట్లతో సినిమాలను నిర్మిస్తున్నారు. దేశంలో మరే సినిమాకు ఖర్చు కాని స్థాయిలో రాజమౌళి తన సినిమాలకు ఖర్చు చేస్తూ విజయాలను అందుకుంటున్నారు. జక్కన్న తన సినిమాల ద్వారా ఇండస్ట్రీలో ఎన్నో సెంటిమెంట్లను బ్రేక్ చేశారు.

అయితే ఆర్ఆర్ఆర్ సినిమా కథ, కథనం వీక్ గా ఉన్నాయని కొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. జక్కన్న, విజయేంద్ర ప్రసాద్ ఆర్ఆర్ఆర్ మూవీలో కొన్ని అద్భుతమైన సన్నివేశాలను రాసుకున్నారని అయితే కొన్ని సన్నివేశాలు మరీ పేలవంగా ఉన్నాయని ప్రేక్షకులు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. మహేష్ సినిమా విషయంలో, తర్వాత ప్రాజెక్టుల విషయంలో జక్కన్న మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జక్కన్న సినిమాల బడ్జెట్లు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో కథ, కథనం విషయంలో చేసే చిన్నచిన్న పొరపాట్లు కొన్నిసార్లు రిజల్ట్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

తెలంగాణలో సోమవారం నుంచి ఆర్ఆర్ఆర్ కు టికెట్ రేట్లు తగ్గగా ఏపీలో మాత్రం ఏప్రిల్ 4వ తేదీ నుంచి టికెట్ రేట్లు తగ్గనున్నాయని తెలుస్తోంది. ఫుల్ రన్ లో ఆర్ఆర్ఆర్ మూవీ ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. బాహుబలి2 రికార్డులను ఆర్ఆర్ఆర్ కచ్చితంగా బ్రేక్ చేస్తుందని తారక్, చరణ్ అభిమానులు భావిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus