DVV Danayya: నిర్మాత దానయ్య కొడుకు పెళ్లి బజాలు మ్రోగుతున్నాయి!

ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఇంట పెళ్లి బాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. దానయ్య కుమారుడు, యంగ్‌ హీరో కల్యాణ్‌ ఓ ఇంటివాడు కాబోతున్నాడట. సమత అనే అమ్మాయితో శనివారం (మే 20న) ఏడడుగులు వేయబోతున్నాడంటూ ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. మాదాపూర్‌లో ఈ వివాహం జరగనున్నట్లు సమాచారం. ఈ శుభకార్యానికి టాలీవుడ్‌ నుంచి పలువురు సెలబ్రిటీలు హాజరై వధూవరును ఆశీర్వదించనున్నారట. ఇదిలా ఉండగా దానయ్య కుమారుడు కళ్యాణ్ హీరోగా కూడా ఎంట్రీ ఇస్తున్నాడు.

కల్యాణ్ దాసరి కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమా ‘అధీరా’ ఈ చిత్రానికి ‘ఆ!’, ‘కల్కి’, ‘జాంబీ రెడ్డి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రశాంత్ వర్మ దర్శకుడు. ఆయనకూ ఇది తొలి పాన్ ఇండియా సినిమా. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీమతి చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇటీవల విడుదల చేసిన అధీరా టీజర్ కూడా హిట్ అయ్యింది.

అధిరా టీజర్ హాలివుడ్ రేంజ్ లో ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు సినిమా మరియు పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు వేస్తున్నాడు అదృష్టం అంటే అలా ఉండాలని జనాలు అనుకుంటున్నారు. ఇకపోతే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో దానయ్య పేరు మార్మోగిపోయింది. రాజమౌళితో సినిమా చేయడం కోసం ఆయనకు 2006లోనే అడ్వాన్స్‌ ఇచ్చి బుక్‌ చేసుకున్నాడు దానయ్య. దీంతో తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా నిర్మాణ బాధ్యతలను దానయ్యకు అప్పగించాడు జక్కన్న.

ఈ సినిమా కోసం కోట్లాది రూపాయలు బడ్జెట్‌ పెట్టిన (DVV Danayya) దానయ్య ఆస్కార్‌ ప్రమోషన్స్‌లో మాత్రం పాల్గొనలేదు. అయితే తను నిర్మించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో అకాడమీ అవార్డు రావడంతో ఉప్పొంగిపోయాడు. ప్రస్తుతం ఆయన పవన్‌ కల్యాణ్‌తో ఓజీ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి సుజీత్‌ డైరెక్షన్‌ అందిస్తున్నాడు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus